వకీల్ సాబ్ మూవీ టీమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 కి పవర్ స్టార్ కి అలాగే అయన అభిమానులకు స్పెషల్ గిఫ్ట్ గా వకీల్ సాబ్ మూవీ టీజర్ లేదా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయాలనీ భావిస్తున్నట్టు ఇండస్ట్రీ టాక్. ఈ విషయం స్వయంగా వకీల్ సాబ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ ద్వారా “WED-NES-DAY” అనే పదం తో చెప్పకనే చెప్పారు.
పవన్ కళ్యాణ్ కి ఇది రే ఎంట్రీ మూవీ కావడం తో ఆయన అభిమానులు ఈ మూవీ టీజర్ లో పవర్ స్టార్ ని చూడాలని ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. వకీల్ సాబ్ మూవీ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం తో పవర్ స్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ మరింత స్పెషల్ గా మార్చడం ఖాయం.

వకీల్ సాబ్ మూవీ టీమ్ మోషన్ పోస్టర్ ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఇండస్ట్రీ టాక్. ఏదేమైనా, మోషన్ పోస్టర్ లేదా టీజర్ రిలీజ్ తో పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకలు హోరెత్తనున్నాయి. పవన్ కళ్యాణ్ ఫాన్స్ మోషన్ పోస్టర్ లేదా టీజర్ ని ట్రెండ్ చేయడం ఖాయం.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘పింక్’ మూవీ ఆధారంగా, ఈ సినిమా ని నిర్మిస్తున్నారు , శ్రీ రామ్ వేణు ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు మరియు శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.