కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ‘పునీత్ రాజ్‌కుమార్‌ది ఆకస్మిక మరణం. మనలో ఎవరైనా.. ఎప్పుడైనా చనిపోవచ్చు అనేది భయంకరమైన నిజం. కాబట్టి మనం జీవించి ఉండగానే ఫాస్ట్ ఫార్వార్డ్ మోడ్‌లో జీవించడం ఉత్తమం. మరణానికి ఎలాంటి పక్షపాతం లేదు. అది ఎవరినైనా తన ఇష్టానుసారంగా తీసుకుపోతుంది. చావు అందరికీ సమానమే’ అంటూ తనదైన స్టైలులో రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు.
పునీత్ బాలనటుడుగా దాదాపు 13 సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించారు. బాలనటుడిగా అత్యధిక పారితోషికం హీరోగానూ అత్యధిక పారితోషికం అందుకున్న స్టార్‌గానూ నిలిచారు. ఆయన నటుడిగా, టెలివిజన్ ప్రజెంటర్‌గా, సింగర్‌గా రాణించారు. పునీత్ రాజ్కుమార్కి తెలుగు సినిమాలకి, తెలుగు ఫిల్మ్ మేకర్స్‌తో విడదీయలేని బంధం ఉంది. హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం అప్పు తెలుగులో వచ్చిన ఇడియట్‌కి రీమేక్. దీనికి కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. అంతేకాదు ఆయన సినిమాలో ఎన్టీఆర్ పాటపాడారు. పునీత్ సినిమాలో రవితేజ గెస్ట్‌గానూ నటించారు.
పునీత్ మృతిపై కన్నడ సీని ప్రముఖులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతిపై పలువురు సినీ పెద్దలు, ప్రముఖులు ట్వీట్లు చేశారు. ట్విట్టర్ ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.