పవర్ స్టార్ పవన్ కళ్యాణ్….! ఆయన ఫాన్స్ కి సంబందించినత వరకు అయన పేరు అంటేనే ఒక బ్రాండ్. ఫిలిం స్టార్స్ కి అభిమానులు ఉంటారు కాని పవర్ స్టార్ కి మాత్రం భక్తులు ఉంటారు. తన ఉన్నతమైన వ్యక్తిత్వం మరియు తన యాక్టింగ్ స్కిల్స్ తో పవన్ కళ్యాణ్ ఎన్నో కోట్ల మంది అభిమానులను మనసు గెలుచుకున్నారు.
పవన్ కళ్యాణ్ కి ఫాన్స్ ఉండరు భక్తులు ఉంటారు అని స్టార్ హీరోలు సైతం పలు సందర్భాల్లో బహిరంగంగానే ఒప్పుకున్నారు. అలాంటి పవన్ స్టార్ టాలీవుడ్ కి తన అన్న చిరంజీవి బ్రదర్ గా ఎంట్రీ ఇచ్చినా తర్వాత తనదైన గొప్ప నటనతో ఒక ప్రత్యేక గుర్తింపు స్టార్ హీరో హోదా సంపాదించుకున్నారు.
పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో మూవీస్ తో టాలీవుడ్ కి ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసాడు. తన సినిమాలతో టాలీవుడ్ కి ఒక కొత్త ట్రెండ్ పరిచయం చేసారు అలాంటి ట్రెండ్ సెట్టర్ మూవీస్.
తొలి ప్రేమ :
పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో నాలుగో సినిమా తొలి ప్రేమ 1998 విడుదలయింది, అప్పట్లో లవ్ స్టోరీస్ కి ఈ మూవీ ఒక ట్రెండ్ సెట్టర్. ఒక మధ్యతరగతి అబ్బాయి బాలు అందమైన ప్రేమ కథే ఈ సినిమా. పవన్ బాలు అనే పాత్రకి ప్రాణంపోశాడు ఆ సినిమా లో సీన్స్ ఎప్పటికి కొన్ని సినిమాల్లో లవ్ సీన్స్ కి ఇన్స్పిరేషన్ గా వాడతారు అంటే ఆ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ లో అర్ధం చేసుకోవచ్చు .

తమ్ముడు:
ఏ టాలీవుడ్ టాప్ హీరో అయినా ఒక హిట్ వస్తే మళ్లీ అదే ట్రెండ్ రిపీట్ చెయ్యాలని చూస్తారు కానీ పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ విజయంతర్వాత, కేవలం ప్రేమ కథ చిత్రాలకే పరిమితం కాకుండా తన లో ఉన్న నటుడి మరో కొత్త కోణంలో పరిచయం చేసిన సినిమా తమ్ముడు. ఈ సినిమాలో తన యాక్టింగ్ తో పవన్ కళ్యాణ్ విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకున్నారు.

బద్రి :
బద్రి సినిమాలోని “నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్…… ” అనే పవన్ కళ్యాణ్ డైలాగ్ ఇప్పుడు కుడా మనకు తరచూ వినిపిస్తూ ఉంటుంది. టాలీవుడ్ కి ఇద్దరు హీరోయిన్స్ కాన్సెప్ట్ పరిచయం చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేసి పవర్ స్టార్ కి తిరుగు లేని క్రేజ్ తెచ్చి పెట్టింది.

ఖుషి:
కాలేజీ స్టూడెంట్స్ మధ్య ఉండే లవ్ వారి గొడవలు అనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా, టాలీవుడ్ యూత్ లో పవర్ స్టార్ కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ కాలేజీ లవ్ స్టోరీ మూవీస్ కి ట్రెండ్ సెట్టర్ గా మారింది.

జల్సా:
పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సూపర్ హిట్ సినిమా జల్సా. ఈ సినిమా చాల లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ కి బాక్స్ ఆఫీస్ లో భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ సీన్స్ హైలైట్స్ గా నిలిచాయి. ఒక హీరోనే కామెడీ కూడా చెయ్యొచ్చు అనే విషయాన్ని పవన్ టాలీవుడ్ కి ఈ సినిమా ద్వారా పరిచేయం చేసారు.

గబ్బర్ సింగ్:
పవర్ స్టార్ కెరీర్ లో నే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్ సింగ్ . ఈ సినిమాలోని ప్రతి ఒక్క డైలాగ్ ఇప్పటికి మనకు తరుచు వినిపిస్తూనే ఉంటుంది. “నాకొంచెం తిక్కుంది దానికి ఒక లెక్కుంది” అనే డైలాగ్ ఈరోజుకి కూడా చాల మంది ఒక ఉత పదం వాడుతున్నారు అంటే ఆయా సినిమా టాలీవుడ్ లో ఎలాంటి ట్రెండ్ సెట్ చేసింది ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు.

అత్తారింటికి దారేది :
త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ కాంబినేషన్ సెకండ్ బ్లాక్బస్టర్ అత్తారింటికి దారేది, ఈ సినిమా స్టోరీ, డైలాగ్స్ , పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ఇందులోని “చూడప్ప సిద్దప్ప నేను సింహం లాంటోడిని అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా అంతే తేడా మిగితాదంతా సేమ్ టూ సేమ్” డైలాగ్ టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమా ఒక విసువల్ వండర్ లాగా ఉంటుంది.
