దీపావళి పండగ సందర్భంగా సినీ తారలంతా సెలబ్రెషన్స్‌లో మునిగిపోయారు. ఈ పండగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ ఒక్కచోట చేరి దీపావళి వేడుకలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపావళి పర్వదినం సం దర్భంగా నటుడు పవన్ కల్యాణ్ దంపతులు సూపర్ స్టార్ మహేష్ దంపతులకు బాహుమతులు పంపారు. అలాగే డైరెక్టర్ క్రిష్‌కు కూడా పవన్ దీపావళి కానుకలు పంపినట్లు తెలుస్తోంది.దీపావళి పండగ సందర్భంగా సినీ తారలంతా సెలబ్రెషన్స్‌లో మునిగిపోయారు. ఈ పండగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ ఒక్కచోట చేరి దీపావళి వేడుకలో పాల్గొన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ క్రిష్‌కు కూడా పవన్ దీపావళి కానుకలు పంపినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ లకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అగ్ర హీరోలుగా కొనసాగుతున్న మహేష్, పవన్ మధ్య మంచి సానిహిత్యం ఉంది. దీపావళి పండుగను పురస్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ బాబుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గిఫ్ట్ లు పంపాడు. ఇందులో పర్యావరణహిత పటాసులతో పాటు స్వీట్లు ఉన్నాయి. పవన్ పంపిన గిఫ్టుల విషయాన్ని స్వయంగా మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో థాంక్యూ అన్నా అండ్ పవన్, హ్యాపీ దివాళి అంటూ నమ్రత పోస్ట్ పెట్టింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పవన్, మహేష్ అభిమానులు ఖుషి అవుతున్నారు.