రేటింగ్ : 6.5/10
అందరు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న నాని సస్పెన్స్ థ్రిల్లర్ ‘వీ’ సినిమా సెప్టెంబర్ 5 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. ఈ సినిమాని మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మించారు. నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
మూవీ స్టోరీ :
డీసీపీ సుధీర్ బాబు ఎలివేషన్ సన్నివేశాలతో సినిమా మొదలవుతుంది. కథ ప్రారంభం నుండే దర్శకుడు సుధీర్. నివేదా థామస్ సైకాలజీ విద్యార్థి, క్రైమ్ పై నవల రాయాలని రీసర్చ్ చేస్తుంటుంది. తన భార్య అదితి రావు ని దారుణంగా హత్య చేసిన వ్యక్తులను నాని చంపుతూ ఉంటాడు, అలా మొదటి సారి నాని నెగటివేరోలే లో కనిపిస్తాడు. నాని ఒక పోలీసుని చంపి తనని పట్టుకోమని సుధీర్ బాబు కి సవాల్ విసురుతాడు. ఆ తర్వాత మరికొన్ని హత్యలు కూడా చేస్తానని చాలెంజ్ చేస్తాడు. అయితే నాని భార్య అదితి రావు ని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? సుధీర్ బాబు నాని ని హత్యలు చేయకుండా ఆపగలిగాడా ? అనేది మిగితా కథ.

రివ్యూ :
నాని వీ మూవీ ప్రేక్షకుల లో ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ అనే అంచనాలలు అస్సలు రీచ్ అవ్వలేకపోయింది, అనని ఫాన్స్ ఈ మూవీ చూసి బాగా నిరాశకు గురయ్యారు .
మోహనకృష్ణ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకొలేకపొయ్యాడు. ఈ సినిమా కథాంశం ఒక సాధారణ రివెంజ్ డ్రామాలాగా అనిపిస్తుంది. కానీ నాని, సుధీర్ బాబు తమ అద్భుతమైన నటనతో అక్కటుకున్నారు.
నాని తన కెరీర్లో తొలిసారిగా నెగటివ్ షేడ్‌లో తన నటనతో అందరిని మెప్పించాడు.
నాని మరియు సుధీర్ బాబు నటన, ఉత్తమ సంగీతం మరియు సినిమాటోగ్రఫీ ఈ సినిమా ప్లస్ పాయింట్స్.
మొత్తం మీద ఇది వన్ టైమ్ వాచ్ మూవీ. మీరు ఈ సినిమా చూడాలని అనుకుంటే తక్కువ అంచనాలు పెట్టుకొని సినిమా చూస్తే మంచిది.

హైలైట్స్:
నాని, సుధీర్ బాబు తమ నటనతో అందరిని అక్కటుకున్నార.
సినిమాటోగ్రఫీ బాగుంది.
అమిత్ త్రివేది మరియు ఎస్.తమన్ ఈ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ అందించారు.
సినిమాలో లోపాలు:
ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ లా కాకుండా రొటీన్ రివెంజ్ డ్రామా లా అనిపిస్తుంది
నెమ్మదిగా సాగే కథనం
స్ట్రెయిట్ ఫార్వర్డ్ రివెంజ్ స్టోరీ
నాని – అదితి రావు హైడారి, సుధీర్ బాబు- నివేదా థామస్ ప్రేమ కథలు రెండూ ప్రేక్షకులను పెద్దగా అక్కటుకోలేక పోయాయి
క్లైమాక్స్ అతిపెద్ద లోపం, ప్రేక్షకులు ఉహించనవిధంగా పెద్ద ట్విస్ట్ ఎం లేకుండానే కథ ముగుస్తుంది

ఈ సినిమా హైప్ పెరగడానికి కారణాలు:
రిలీజ్ కి ముందు అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి బాగా బజ్ క్రియాట్ చేసింది. దానితో పాటు ఇది టాలీవుడ్ చరిత్రలోనే OTT ప్లాటుఫార్మ్ లో విడుదలైన మొట్ట మొదటి తెలుగు హై బడ్జెట్ మూవీ.
అంతేకాకుండా ఈ సినిమాకి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, ఇది నాని కెరీర్ లో 25 ఫిల్మ్ దానితో పాటు నాని నెగటివ్ షేడ్ కనిపించిన మొదటి సినిమా కూడా ‘వీ’ అవ్వడం అందరిలో మరింత ఆసక్తి పెంచింది.
లొక్డౌన్ కారణంగా టాలీవుడ్ లో టాప్ హీరో గా పేరున్న నాని సినిమా అయినప్పటికీ అసలు ఎటువంటి ప్రొమోషన్స్ కానీ హడావిడి కానీ లేకుండా ‘వీ’ సినిమా డైరెక్ట్ గా మన ఇంట్లోనే కూర్చొని చూసే విధంగా OTT లో విడుదల అయ్యింది.
ఒక సినిమా రిలీజ్ అవ్వతుంది అంటే మాములుగా అయితే ఆ మూవీ టీం, హీరో అతని ఫాన్స్ దాని రెస్పాన్స్ కోసం వేచిచూడడం సాధారణమే కానీ ఇప్పుడు దీనికి బిన్నంగా నాని వీ’ సినిమా కోసం మొత్తం ఫిలిం ఇండస్ట్రీ ఎదురుచూస్తుంది.
ఒకవేళ న నాని సినిమా OTT లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటే ఇంకా ఎన్నో బడా బడ్జెట్ సినిమాలు OTT లో విడుదలకు లైన్ కట్టడం ఖాయం.
“‘వీ’ ” సినిమా లీకైన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం దాంతో ప్రతి ఒక్కరు కథ ని ఊహించుకోవడం కూడా సినిమాకి బాగా కలిసివచ్చింది.
ఈ చిత్రంలో నాని, సుధీర్ బాబు మరియు నివేతా థామస్ పాత్రల యొక్క అన్ని పోస్టర్లు మరియు ఫోటోలను విడుదల చేసిన మూవీ టీం, అదితి రావు హైదారీ పాత్రను అనుకున్నట్లుగా రహస్యంగా ఉంచింది, మరియు సినిమా విడుదలకు ఒక రోజు ముందు నాని సెప్టెంబర్ 4 న, తన ట్విట్టర్ ద్వారా ఒక పోస్టర్‌ను పంచుకున్నారు, దీనిలో నాని అదితి రావు ఫోటో కూడా ప్రజలలో ఈ సినిమాపై ఎక్కువ ఆసక్తిని కలిగించింది.
Also Read: Nani V Movie Review, Story, Highlights And Drawbacks