TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » ‘మా’కు శుభవార్త చెప్పబోతున్నా : మంచువిష్ణు

‘మా’కు శుభవార్త చెప్పబోతున్నా : మంచువిష్ణు

by Murthy

మా ఎన్నికల బరిలో నిలబడతాననిప్రకటించిన మంచు విష్ణు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు ఓ ప్రత్యేక భవనం నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే తన జేబులోంచి డబ్బులు పెట్టి భవంతిని కట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాటలను నిజం చేస్తూ… తన హామీలు ఉత్తవి కావని నిరూపించేందుకు విష్ణు సంచలన ప్రకటన చేశారు. మా బిల్డింగ్‌ కోసం మూడు స్థలాలు చూశానన్నారు. వాటిలో ఏది బెస్టో అందరం కలిసి డిసైడ్‌ చేద్దామంటూ ఓ వీడియోని ట్వీట్‌ చేశారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన సంగతి తెలిసిందే. అధ్యక్షుడి స్థానం కోసం ప్రకాష్ రాజ్..మంచు విష్ణు లు పోటీ పడగా అధిక మెజార్టీతో మంచు విష్ణు గెలుపొందారు. అనంతరం తన ఫ్యాన్ సభ్యులతో కలిసి మంచు విష్ణు ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఇక ఎన్నికలకు ముందు మంచు విష్ణు మా సభ్యులకు ఎన్నో హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మా కోసం బిల్డింగ్ పింఛన్లు.. ఉచిత విద్య, అంటూ మంచు విష్ణు హామీలిచ్చారు.  మంచు విష్ణు రేపు ఓ గుడ్ న్యూస్ చెబుతాను అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

దాంతో విష్ణు ఎలాంటి పరకటన చేస్తారా అని మా సభ్యులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి పోటీచేసి గెలిచిన అభ్యర్థులు అంతా “మా” కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ రాజీనామాలను విష్ణు ఇంకా ఆమోదించలేదని చెప్పారు. పదవులు లేకపోయినా తాము మా సమస్యల కోసం మాట్లాడదామని ప్రకాష్ ప్యానల్ సభ్యులు చెబుతున్నారు. మరో వైపు ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్నారు.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More