తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందిస్తూ దూసుకుపోతోంది ‘ఆహా’ ఓటీటీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ సరికొత్త ట్రైలర్‌ని విడుదల చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్‌స్టోరి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత నెలలో(సెప్టెంబర్ 24) విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ‘వావ్’ అనిపించింది.
అలాగే – ఒక్క రాత్రిలో జరిగే కథతో ‘హెడ్స్ అండ్ టేల్స్’ తెరకెక్కించారు. ‘హెడ్స్ అండ్ టేల్స్’లో అనీషా పాత్రలో శ్రీవిద్య మహర్షి, మంగ పాత్రలో దివ్య శ్రీపాద నటించారు. మానవుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రతి ఒక్కరి పాత్ర తెరమీదకు వస్తుంది. ‘హెడ్స్ అండ్ టేల్స్’ గురించి మేకర్స్ మాట్లాడుతూ “ఇదొక అందమైన కథ. ముగ్గురు మహిళల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఒక్కొక్కరూ జీవితంలో ఒక్కో దశలో ఉంటారు. జీవిత భాగస్వామితో సమస్యలు వస్తాయి. అప్పుడు విధిరాత ఎలా రాసి ఉంది? ప్రతి మహిళకు భాగస్వామి పట్ల ఏ విధమైన ప్రేమ కలిగి ఉంది? అనేది కథ” అని చెప్పారు. సాయికృష్ణ ఎన్రెడ్డి ఇప్పుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అక్టోబర్ 22 నుండి ‘జీ 5’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందీ సినిమా. హీరోయిన్ రెజీనా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఇంకా ఓటీటీ ఫ్లాట్ ఫాం లలో ఎన్నో సరికొత్త సిరీస్ సందడి ఇవాళ మొదలవ్వబోతోంది.