TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » విజయ్‌ సేతుపతిని తన్నిన వారికి బహుమతి: అర్జున్‌ సంపత్‌

విజయ్‌ సేతుపతిని తన్నిన వారికి బహుమతి: అర్జున్‌ సంపత్‌

by Murthy

విజయ్ సేతుపతికి మంచి నటుడని.. ఎవరి జోలికీ పోకుండా తన పనేంటో తాను చేసుకుని పోతుంటాడనే పేరుంది. అయితే ఎప్పుడూ ఒకేలాగా ఉండాలా..? అని అనుకున్నాడేమో కానీ ఈ మధ్య వివాదాలను కొని తెచ్చుకుంటున్నాడు. ఇటీవల ఓ టీవీ చానెల్‌తో మాట్లాడిన ఆయన.. హిందూ దేవుళ్లకు జరిగే అభిషేకం, అలంకరణ, కైంకర్యాలను తప్పుబట్టారు. ఆయన చేసిన తీవ్ర దుమారమే రేపాయి. ఆయన వ్యాఖ్యలపై అఖిల భారత హిందూ మహాసభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు లేఖ రాసింది. సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరింది. సొంత ప్రచారం కోసం హిందూ మతమే దొరికిందా? అని మహాసభ కన్నెర్రజేసింది. మరోవైపు.. నెటిజన్లు, హిందూ సంఘాలు కూడా సోషల్ మీడియా వేదికగా సేతుపతిపై తీవ్రస్థాయిలో మండిపడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు.

కోలీవుడ్ నటులు వివాదాల్లో మునిగి తేలుతున్నారు. వివాదాలంటే దూరంగా ఉండే నటులు సైతం అదెలా ఉంటుందో చూడాలని ఇలా చేస్తున్నారేమో కానీ ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో నానుతున్నారు. కొందరు నటులు కరోనా కష్టకాలంలో సేవలు చేస్తూ వారి మంచి మనసును చాటుకుని వార్తల్లో నిలుస్తుంటే.. ఇంకొందరేమో ఇలా వివాదాలతో హాట్ టాపిక్ అవుతున్నారు.

విజయ్‌ సేతుపతిని తన్నిన వారికి ఒక్క కిక్‌కు రూ. 1001 రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది. దీనిపై  హిందూ మక్కల్ కట్చి అనే ఒక హిందూ సంస్థ చీఫ్‌  ‘అర్జున్‌ సంపత్‌’ స్పందిస్తూ స్వాతంత్ర సమరయోధుడు దైవతిరు పసుంపోన్ ముత్తురామలింగ తేవర్ అయ్యను, దేశాన్ని సేతపతి అవమానించాడని ఆయన క్షమాపణ చెప్పేవరకు ఎక్కడ కనిపించినా కొట్టాలని కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. 

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More