TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » లైగర్ సినిమా పై అటు భయాలూ…ఇటు నమ్మకాలు!..

లైగర్ సినిమా పై అటు భయాలూ…ఇటు నమ్మకాలు!..

by Murthy

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ లో చాలా తక్కువ టైం లోనే స్టార్‌ హీరోగా ఎదిగాడు విజయ్‌ దేవర కొండ. అర్జున్‌ రెడ్డి సినిమా తో యూత్‌ లో ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్న విజయ్‌ దేవర కొండ… అప్పటి నుంచి మంచి విజయాలను అందుకున్నాడు. నటుడు గానే కాకుండా బిజినెస్‌మేన్‌గానూ ఫుల్‌ ఫామ్‌లో ఉన్న దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న తాజా మూవీ ”లైగ‌ర్”. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ “రోగ్” వంటి డిజాస్టర్ సినిమా తీస్తారని ఎవరు కలలో కూడా అనుకుని ఉండరు. చాలా కాలం తర్వాత ఈ మధ్యనే “ఇస్మార్ట్ శంకర్” అనే సినిమాతో పెద్ద హిట్ అందుకున్నారు. అయితే ఆ సినిమా కూడా పూరి జగన్నాథ్ హిట్ కి ఫ్లూక్ హిట్ అనే చెప్పాలి. అయినా సరే “ఇస్మార్ట్ శంకర్” సినిమా చూశాక విజయ్ దేవరకొండ కూడా “లైగర్” సినిమా ఒప్పుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ నమ్మకాన్ని నిలబెట్టాలి పూరి. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌తో తెర‌కెక్కనున్న ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. దీంతో ఈ చిత్రం ఏవిధంగా ఉండ‌బోతుంద‌న‌నే ఆస‌క్తి సినీ అభిమానులకు ఉంటుంది.

ఈ లైగర్‌…సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్ వచ్చింది. దీపావళి కానుకగా ఈ సినిమా లో మైక్‌ టైసన్‌ పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. మైక్‌ టైసన్‌ బ్యాక్సింగ్‌ కు సిద్ధమన్నట్లు లుక్‌ ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ లో మైక్‌ టైసన్‌ చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. మరోవైపు పూరి తనయుడు ఆకాష్ పూరి నీ పరిచయం చేస్తూ “మహబూబా” వంటి డిజాస్టర్ సినిమాలు తీయడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఆకాష్ పూరి నటించిన రెండవ సినిమా “రొమాంటిక్” కి కూడా కథ అందించింది పూరినే. ఇక ఆ కథ కూడా పెద్ద గొప్పగా ఏమీ లేదు. అదే అవుట్ డేటెడ్ కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పూరి. ఈనేపథ్యంలో “లైగర్” తో మాత్రం ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించగలరు అని అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. అలానే “లైగర్” సినిమా మీద భయాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More