మాస్టర్ చెఫ్ తెలుగు అనే రియాల్టీ షో కు ఇటీవలే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఎంపికయింది. హీరోయిన్గా అలరించిన తమన్నా యాంకర్‌గాను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. తమన్నా భాటియా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం జెమినీ టెలివిజన్‌లో ఆగస్టు 21వ తేదీన ప్రారంభమైంది. ఈ షోలో జడ్జీలుగా సంజయ్ తుమ్మ, మహేష్ పడాల, చలపతిరావు వ్యహరించారు. అయితే ఆరంభంలో ఈ షో మంచి రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. మాస్టర్ చెఫ్ తెలుగు పేరుతో జెమినీ టీవీ లో ఈ షో టెలికాస్ట్ అవుతోంది . అయితే షోకు పోస్ట్ గా ఎంపికైన తమన్నా… సినిమా షూటింగ్ కారణంగా షెడ్యూలు కు అందలేదు. తమన్నా భాటియా కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. దీంతో తమన్నా భాటియా స్థానంలో… యాంకర్ అనసూయ ను ఇటీవల పోస్ట్ గా తీసుకుంటున్నట్లు ప్రకటించింది అయితే దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా హీరోయిన్ తమన్నా… మాస్టర్ చెఫ్ తెలుగు పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ 2007 సంవత్సరంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించింది తమన్నా.
ఇప్పటికి టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ల లిస్టులో ని తమన్నా ఉండటం గమనార్హం. హీరోయిన్ తమన్నా న్యాయవాది… మాస్టర్ చెఫ్ తెలుగుపై కేసు వేసినట్లు సమాచారం అందుతోంది. బకాయిలు చెల్లించకపోవడం , ప్రొడక్షన్ హౌస్ ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ ద్వారా అనైతిక ప్రవర్తన కారణంగా మాస్టర్‌చెఫ్ తెలుగుపై కేసు వేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.