TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » Cinema » ఆర్‌ఆర్‌ఆర్‌ గ్లింప్స్‌ – సింప్లీ సూపర్బ్!!

ఆర్‌ఆర్‌ఆర్‌ గ్లింప్స్‌ – సింప్లీ సూపర్బ్!!

by Murthy

‘‘మైండ్‌ బ్లోయింగ్‌ టీజర్‌. భారతీయ చిత్రపరిశ్రమకు రాజమౌళి ఓ గర్వకారణం. నా బ్రదర్‌ చరణ్‌.. నా బావ తారక్‌.. పవర్‌ప్యాక్డ్‌ ప్రదర్శనతో అదరగొట్టారు. అజయ్‌, ఆలియా, శ్రియతోలతోపాటు చిత్రబృందం మొత్తానికి నా హృదయ పూర్వక అభినందనలు’’ అని బన్నీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘రాజమౌళి సార్‌.. 45 సెకన్ల వీడియోలో సినిమాలో కీలక పాత్రలన్నింటినీ ఇంత వైవిధ్యంగా ఎలా చూపించగలిగారు’’ అని నాని కామెంట్‌ చేశారు. ‘‘మెగా మాస్‌ మ్యాజిక్‌. లైఫ్‌లో ఇలాంటి అవుట్‌స్టాండింగ్‌ థింగ్స్‌ను చూడలేము’’ అని రానా దగ్గుబాటి ట్వీట్‌ చేశారు.

రాజమౌళి డైరెక్షన్ ఒక ఎత్తైతే.. ఇందులో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం మరో హైలైట్. బాహుబలితో తెలుగు సినిమా రేంజ్‌ను మార్చేసిన రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌తో తన రికార్డులు తానే తిరగరాయనున్నాడని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్‌ను విజువల్ వండర్‌గా సిద్ధం చేస్తున్నాడు. తారక్‌–రామ్‌చరణ్‌తోపాటు చిత్రంలో కీలక పాత్రలను 45 సెకన్ల వీడియోలో చక్కగా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఓ పక్క అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంటే సినీ సెలబ్రిటీల నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది.

డి.వి.వి దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. చరణ్‌కు జోడీగా అలియాభట్‌, తారక్‌కు జంటగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ కనిపించనున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని కీలక పాత్రధారులు. 

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More