ర్తి సురేష్.. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటి కీర్తి సురేశ్. ‘మహానటి’ తర్వాత ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగింది. తెలుగులో ప్రస్తుతం ‘భోళా శంకర్’, ‘సర్కారు వారి పాట’, ‘దసరా’చిత్రాల్లో నటిస్తోంది. పండగను పురస్కరించుకుని నాని కొత్త చిత్రం ‘దసరా’ను ప్రకటించారు. టైటిల్ టీజర్‌తోనే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నాని లుక్ కాస్త డిఫరెంట్‌గా ఉండటం, తెలంగాణ యాస మాట్లాడటం ఆసక్తిగా అనిపించింది.
ఇక ఈ సినిమా కోసం కీర్తి సురేశ్ భారీ పారితోషికం తీసుకుంటోందట. ‘దసరా’ కోసం ఆమె రూ.3కోట్లు తీసుకొంటున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. భారీ బడ్జెట్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకూడదని చిత్ర బృందం భావిస్తోందట. అందులో భాగంగానే ఆమె అడిగిన పారితోషికాన్ని ఇస్తునట్లు తెలుస్తోంది. గతంలో నానితో కలిసి కీర్తి సురేశ్ ‘నేను లోకల్’ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది.
నితిన్‌తో కలిసి ‘రంగ్‌దే’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది కీర్తి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. ఇక తమిళంలో రజనీకాంత్‌తో కలిసి ‘అన్నాత్తే’, మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలు చేస్తుంది ఈ భామ.