ఫలక్ నుమా దాస్, హిట్ సినిమాలతో యువతలో గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్. ఇటీవలే పాగల్ సినిమాతో మంచి విజయం అందుకున్న విశ్వక్ సేన్ మరొక సినిమాను అనౌన్ చేశాడు. ఈ సారి వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశ్వేక్. గామి” చిత్రంలో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటిస్తున్నారు. గామి” అనే పేరుతో సరికొత్త జోనర్ లో సినిమా చేస్తున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నీకున్న సమస్య నిన్నే కాదు.. పరోక్షంగా మా అందరినీ కూడా బాధిస్తోంది..’ అనే వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ స్మాల్ టీజర్ అనూహ్య స్పందన తెచ్చుకుంటోంది. తాజాగా విడుదలైన టీజర్ లో విశ్వక్ స్పష్టంగా కనిపించకపోయినా కొన్ని షాట్స్ లో ఆ ఫీల్ కనిపించింది. అంతేకాదు అతను ఏదో మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు చూపించారు. మిస్టరీ మరియు సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రంలో శంకర్ అనే అఘోరా పాత్ర యొక్క అడ్వాంచర్ జర్నీని చూపించబోతున్నారు. ఈ చిత్రంలో ‘కలర్ ఫోటో’ ఫేమ్ చాందిని చౌదరి – ఎమ్ జి అభినయ – మహమ్మద్ సమాద్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటి వరకు కథ పరంగా వెరీయేషన్ చూపిస్తూ వచ్చిన విశ్వక్ సేన్.. ఈసారి సరికొత్త కంటెంట్ తో పాటుగా ఏకంగా అఘోరా అవతారంలోకి మారిపోయాడు. ”గామి” చిత్రానికి విద్యాధర్ కాగిట దర్శకత్వం వహిస్తున్నారు. V సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ మీద కార్తీక్ శబరిష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేష్ కుమారన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.