పండగల టైంలో సినిమాలు అంటే ఆ హడావిడి వేరేగా ఉంటది. అందులోనూ స్టార్ హీరోల సినిమాలు పండగలకి రిలీజ్ అవుతున్నాయి అంటే థియేటర్ల దగ్గర అభిమానుల రచ్చ మాములుగా ఉండదు. ఇంకో మూడు రోజుల్లో దీపావళి ఉంది. ఈ దీపావళికి కూడా స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. తమిళ్ స్టార్ హీరో రజనీ కాంత్ సినిమా వస్తుందంటే అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుడికీ ఆసక్తి. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం అన్నాత్తే – తెలుగులో పెద్దన్నగా వస్తోంది. ఈ చిత్రం నవంబర్ 4 దీపావళి కానుకగా విడుదలవుతోంది. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ వంటి భారీ తారాగణమే ఈ చిత్రంలో ఉంది.
హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ఎనిమి.. మరో హీరో ఆర్యతో కలిసి నటించిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకుడు. మృణాళిని రవి, మమతా మోహన్ దాస్, ప్రకాశ్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కూడా నవంబర్ న విడుదల అవుతోంది.
సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’ యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనూప్ రూబెన్స్ స్వరాలందించారు. దీపావళి పండగను పురస్కరించుకుని ఈనెల 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ చిత్రం ‘సూర్యవంశీ’ రణ్‌వీర్‌సింగ్, అజయ్‌దేవ్‌గణ్ కీలక పాత్రలు పోషించారు. పోలీస్ కథ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్కు రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ దీపావళి కానుకగా థియేటర్లో సందడి చేసేందుకు నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది
థానోస్ తర్వాత భూమిని నాశనం చేసేందుకు వస్తున్న అతీంద్రియ శక్తులైన ఏలియన్స్‌ను కొందరు సూపర్ హీరోలు ఎలా ఎదుర్కొన్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? ఇంతకాలం వాళ్లు ఎక్కడ ఉన్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. క్లోవీజావ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎటర్నల్స్’ నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మాస్ హీరోగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న తమిళ నటుడు సూర్య స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం ‘జై భీమ్’. జ్ఞానవేల్ దర్శకుడు. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ కోర్టు డ్రామా కథాంశంతో ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వినోదభరిత చిత్రం ‘గల్లీ రౌడీ’. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.