TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » Cinema » అనన్య కెరీర్ కి డ్రగ్స్ కేసు ముసురు బాగా పట్టిందా?

అనన్య కెరీర్ కి డ్రగ్స్ కేసు ముసురు బాగా పట్టిందా?

by Murthy

లైగర్ హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎక్స్ టెండ్ కాబోతోందా..? లైగర్ హీరోయిన్ అనన్య పాండేని ఇప్పటికే పోలీసులు కార్నర్ చేశారు. ఆర్యన్ ఖాన్ ఫ్రెండ్ అయినందుకు అనన్య ఇంటికెళ్లడమే కాకుండా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు. ఈ ఇన్వెస్టిగేషన్ ఇంతటితో అయిపోతే సరే.. ఇది కాస్త ఎక్స్ టెండ్ అయ్యితే ఆ సెగ లైగర్ కి తగిలే ఛాన్సుందా..? అనన్య తెలుగులో లైగర్ మూవీతో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది కాబట్టి దర్శకుడు పూరీ జగన్నాధ్ ఏ హడావిడి లేకుండా ఇంట్రెస్టింగ్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండతో తెలుగులో డెబ్యూ చేస్తుంది కాబట్టి అప్పుడే అనన్య పేరు టాలీవుడ్‌లో పాపులర్ అయ్యింది.

అయితే కోలీవుడ్‌లో కూడా ఒక క్రేజీ యాక్టర్‌తో నటించే ఛాన్స్ వచ్చిందట అనన్యకు. తమిళ హీరో విజయ్ ప్రస్తుతం బీస్ట్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే మరో సినిమా సెట్లో అడుగుపెట్టనున్నాడు విజయ్. అయితే ఆ అప్‌కమింగ్ సినిమాలో ఒక హీరోయిన్‌గా అనన్య పాండేను ఎంపిక చేయాలని మేకర్స్ భావించారట కానీ ఎన్‌సీబీ విచారణ నేపథ్యంలో వారు ఈ ఆలోచనను విరమించుకున్నట్టు సమాచారం. ఎంతైనా తెలుగులో విజయ్ దేవరకొండతో నటిస్తున్న అనన్య.. తమిళంలో విజయ్‌తో నటించే ఛాన్స్ ఇప్పటికి మిస్ చేసుకున్నట్టే.

అనన్యని కూడా ఆర్యన్ ఖాన్ లా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసే పరిస్తితి వస్తే.. అప్పుడు లైగర్ కి ఎఫెక్ట్ పడుతుందా అంటే ..పెద్దగా పడదనే అంటున్నారు టీమ్. ఎందుకంటే ఆల్రెడీ 80 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసింది లైగర్. పూరీ జగన్ డైరెక్షన్లో తెర కెక్కుతున్న ఈ సినిమాకి సంబందించి సినిమా స్టార్ట్ అయ్యినప్పుడే ఇద్దరి మద్యా సీన్స్ మ్యాగ్జిమమ్ కంప్లీట్ చేసేశారు యూనిట్ .ఒక వేళ అనన్యకి ఈ ఇన్వెస్టిగేషన్ కి సంబందించి బ్రేక్ కావల్సి వచ్చినా.. ఇంకా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యలేదు కాబట్టి.. అర్జెంటుగా లైగర్ కి వచ్చిన నష్టమేం లేదు.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More