TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » Cinema » ‘అఖండ’ ఆదరణ – బాలకృష్ణ న్యూ అవతార్ అదుర్స్!

‘అఖండ’ ఆదరణ – బాలకృష్ణ న్యూ అవతార్ అదుర్స్!

by Murthy

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి హిట్‌ సినిమాల తర్వాత బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్‌ సినిమా ఇది. దీంతో నందమూరి అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా నుంచి ‘అఖండ’ టైటిల్‌ సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘కం కం కంగుమంది శంఖం’ అంటూ సాగే ఈ పాటను ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌ ఆయన ఇద్దరు కుమారులు సిద్దార్థ్‌, శివమ్‌ ఆలపించారు. మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలయ్య పవర్‌ఫుల్‌ లుక్‌తోపాటు అఘోరాగానూ కనిపించనున్నారు. శ్రీకాంత్‌ విలన్‌గా కనిపించనున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన రెండు వీడియోలు, టైటిల్‌ సాంగ్‌ టీజర్‌కు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దీపావళి సందర్భంగా విడుదలైన టైటిల్‌ సాంగ్‌ టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. కాగా తాజాగా ఈ పాట పూర్తి లిరికల్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ( హీరోయిన్ గా నటిస్తోంది. పూర్ణ, జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ., ఎం రత్నం డైలాగ్స్ అందించారు.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More