TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » మరోమారు సంచలనం – షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రాపై ఫిర్యాదు!.

మరోమారు సంచలనం – షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రాపై ఫిర్యాదు!.

by Murthy

మోడల్ షెర్లిన్ చోప్రా రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. జుహు పోలీస్ స్టేషన్‌‌లో ఆమె రాజ్‌కుంద్రాపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై ఫిర్యాదు చేయడానికి మోడల్ షెర్లిన్ చోప్రా తన న్యాయవాదులతో కలిసి ముంబైలోని జుహు పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తనతో పనిచేయించుకుని రాజ్ కుంద్రా ఇంకా డబ్బు ఇవ్వలేదని షెర్లిన్ చోప్రా ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలను కుంటున్నట్లు ఆమె పేర్కొంది.శిల్పా శెట్టి, ఆమె భర్త గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. అసభ్యకరమైన సినిమాలు తీసినందుకు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. దాదాపు 2 నెలలు జైలులో ఉన్న ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు.

రాజ్ కుంద్రా అరెస్టు అయినప్పటి నుంచీ హీరోయిన్, మోడల్ షెర్లిన్ చోప్రా అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తాజాగా ఆమె శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్టోబర్ 14 న షెర్లిన్ చోప్రా తనపై మోసానికి పాల్పడినందుకు, మానసిక వేధింపులకు పాల్పడినందుకు రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి కుంద్రాపై ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీసులను కోరినట్లు ఆమె చెప్పింది.

రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్‌తో సంబంధం ఉందని, వాళ్ళ ద్వారా తనను బెదిరించారని, లైంగిక వేధింపుల కేసును వెనక్కి తీసుకోకపోతే జీవితం నాశనం అవుతుందంటూ హెచ్చరించారని ఆమె అన్నారు. ఏప్రిల్ 19 న రాజ్ బలవంతంగా నా ఇంట్లోకి ప్రవేశించి కేసును ఉపసంహరించుకోవాలని నన్ను బెదిరించాడు అంటూ ఆమె ఆరోపణలు చేయడం మరోమారు సంచలనంగా మారింది

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More