కొన్ని రాష్ట్రాల్లో ప్రసారం అవుతున్న రియాల్టీ షోలో ఎక్కువగా పాపులారిటీ సాధించిన షో – బిగ్‌బాస్ . వివిధ బాషల్లో ఈ షో కొనగాతున్న విషయం తెలిసిందే. అయితే కంటెస్టెంట్ల మధ్య ఎక్కువగా ఆటలు పెడుతుంటాడు బిగ్ బాస్. ఆ ఆటల్లో ఓడిపోతే స్పోర్టివ్ తీసుకొని అందరూ మళ్లీ కలిసి పోయి ముందుకు వెళ్తుంటారు. కొంతమంది ఆ గేమ్ లల్లో మరేదైనా ఈవెంట్లో మంచిగా చేయలేదనో తీవ్ర భావోద్వేగానికి గురవుతుంటారు. అయితే ఇందులో రెండో వ్యక్తుల తరహాకి చెందిన అఫ్సానా ఖాన్ – సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ బిగ్ బాస్ లో సూసైడ్ అట్టెంప్ట్ చేసింది. ఈ ఘటనతో షోలో ఉన్న మిగతా కంటెస్టెంట్లు ఆందోళనకి గురయ్యారు.
హౌస్ లో కెప్టెన్ చెప్పిందే వేదవాక్కు అని అందరికీ తెలిసిందే. ఈ వారం కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు ఉమర్ రియాజ్. అతడికి ఓ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్ . దాని ద్వారా వీఐపీ టికెట్స్ ని అందులో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్లకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అందులో అతడు కరణ్ కుంద్రా, నిషాంత్ భట్, తేజస్వి ప్రకాశ్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్లకు ఇచ్చాడు. దీంతో అక్కడ జరిగే ఓ గేమ్ నుంచి అఫ్సానా ఖాన్ ని తొలగించేశారు. అందరూ కావాలనే చేస్తున్నారని.. అందరూ తనను టార్గెట్ చేస్తున్నారని, స్నేహితులే వెన్నుపోటు పొడుస్తున్నారని సీరియస్ అయింది అఫ్సానా.
అఫ్సానా ఖాన్ మొదటి నుంచి వివాదాలతోనే కనిపిస్తుంది.. ఆమె తీరు ఎవరికి నచ్చడం లేదని మాటలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆమె బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కత్తితో తనకు తాను గాయపరుచుకొని ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నించడంపై బిగ్‌బాస్ తీవ్రంగా స్పందించారు. తనపై నియంత్రణను కోల్పోయి స్వయంగా గాయపరుచుకోవడం గేమ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ నిర్వాహకులు కంటెస్టెంట్‌ను షో నుంచి ఎలిమినేట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.