TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » Bigg Boss Telugu » జైలు నుంచి వచ్చిన శ్వేత – బిగ్ బాస్ నుంచి బైటకి వెళ్ళడం ఖాయమేనా??.

జైలు నుంచి వచ్చిన శ్వేత – బిగ్ బాస్ నుంచి బైటకి వెళ్ళడం ఖాయమేనా??.

by Murthy

బిగ్ బాస్ ఐదవ సీజన్ ఆరవ వారం చివరికి చేరుకుంది. వారాంతం అంటే హోస్ట్ నాగ్ రావడం ఒకరోజు హౌస్ మొత్తం సందడిగా మారడం.. చూస్తుండగానే ఇంట్లో నుండి ఒకరిని బయటకి పంపడం చకచకా జరిగిపోతాయి. అలానే ఈ వారం కూడా ఎలిమినేషన్ కి సమయం ఆసన్నమైంది. ఆరవ వారానికి గానూ నామినేషన్లలో ఏకంగా 10 మంది ఉన్నారు. అయితే ఈ వారం షణ్ముఖ్, శ్రీరామ్ వంటి బలమైన కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కోసం నామినేషన్లలోకి రాగా, కాజల్, యాని మాస్టర్ వంటి కంటెస్టెంట్లు తప్పించు కున్నారు. విశ్వ, జెస్సీ, రవి, మానస్, ప్రియాంక, లోబో, సిరి, సన్నీ, శ్వేత, శ్రీరామ చంద్ర ఈవారం నామినేటెడ్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారు.

అయితే పరిస్థితి చూస్తుంటే ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం కన్పిస్తోంది.   గత వారానికి ఇప్పటికీ షోలో అనూహ్యంగా ఎన్నో మార్పులు వచ్చాయి. కంటెస్టెంట్ల ఆట తీరు నుండి వాళ్ళకొచ్చే ఓటింగ్ వరకు ఎన్నో మార్పులు జరిగినట్లు తెలుస్తుంది. గతవారం లోబో, విశ్వ, హమీదలు డేంజర్ జోన్ లో ఉండగా హమీదా ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు లోబో, విశ్వలతో పాటు శ్వేత నామినేషన్స్ లో ఉండగా ఇందులో కూడా లోబో ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ రోజు సాయంత్రం శ్వేత ఎలిమినేట్ కానుంది. నిజానికి హౌజ్ మేట్స్ అందరిలో శ్వేత, విశ్వకు అతి తక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు. కానీ విశ్వ ఈ వీక్ కెప్టెన్ గా మరోసారి ఎన్నిక కావడంతో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. శ్వేత కూడా చిన్న దానికి పెద్ద దానికి గొడవలు సాగదీయయడంతో పాటుగా సెంటిమెంట్ అస్త్రాలును ప్రయోగించి ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పిస్తుంది. మొత్తంగా ఈ ముగ్గురు డేంజర్ లో ఉన్నా.. అందరిలో ఈ వారం శ్వేత ఎలిమినేషన్ కి ఎక్కువ అవకాశం ఇచ్చాడని తెలుస్తుంది.

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More