బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నటరాజ్, ఇప్పుడు శ్వేత రవిని టార్గెట్ చేయడంలో ఆంతర్యం చాలా ఉందనే అనుకోవాలా?.. బిగ్ బాస్ 5 తెలుగు ఇప్పటి వరకూ ఇంట్లో నుంచి ఆరుగురు కంటెస్టెంట్స్ బయట వచ్చేశారు. ఇప్పటివరకూ సరయు, ఉమాదేవీ, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదలు బయటకు వెళ్లారు.ఈ ఆరో వారం ఊహించని విధంగా ఎన్నో ఉత్కంఠల మధ్య శ్వేతా వర్మ బయటకు వచ్చేసింది. శ్వేత తో నాగార్జున ఓ ఆట ఆడించాడు. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేత వర్మ ఒక్కో కంటెస్టెంట్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పేసింది.
రవితోనే జాగ్రత్తగా ఉండాలని కంటెస్టెంట్ల అందరినికి ఇండైరెక్ట్ గా చెప్పింది. రోడ్డు భద్రతలో భాగంగా చూపించే సిగ్నల్స్‌తో కంటెస్టెంట్లను పోల్చాలని శ్వేతా వర్మకు టాస్క్ ఇచ్చాడు. ఈ క్రమంలో.. రవి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రవి వెరీ స్మార్ట్ అని, అతడికి దూరంగా ఉండాలని ఇంటి సభ్యులను హెచ్చరించింది శ్వేత.
ఇటీవలే బైటికి వచ్చిన నటరాజ్ మాస్టర్ కూడాఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. దొంగ నాటకాలు వేసేవాళ్లను ప్రేక్షకులు నమ్మారని జనాలను పూల్స్ చేస్తున్న కంటెస్టెంట్లకు మాత్రమే తాను జంతువుల పేర్లను పెట్టానని లహరి తన వెనుక పడుతోందని రవి మరో కంటెస్టెంట్ కు చెప్పడంతో తాను గుంట నక్క అనే పేరు పెట్టానని నటరాజ్ మాస్టర్ పేర్కొన్నారు. జెస్సీ, సిరి, షణ్ముఖ్ కలిసి ఆడుతున్నారని నటరాజ్ మాస్టర్ చెప్పుకొచ్చారు.