TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » Bigg Boss Telugu » లవర్ – హమీదా ‘అల్విదా’ చెప్పడం శ్రీరాంకి నష్టమా – లాభమా!?.

లవర్ – హమీదా ‘అల్విదా’ చెప్పడం శ్రీరాంకి నష్టమా – లాభమా!?.

by Murthy

శ్రీరామ్-హమీదాల మధ్య లవ్ ట్రాక్ పెట్టారు బిగ్ బాస్.   గతంలో మోనాల్ ని ఏవిధంగా అయితే ఎంకరేజ్ చేశారో.. ఈ సీజన్‌లో శ్రీరామ్-హమీదాల మధ్య ఎఫైర్‌ని మొదలుపెట్టించారు.  హమీదా కూడా అస్సలు తగ్గడం లేదు. గుప్పు గుప్పుమని సిగరెట్‌లు పీల్చేయడమే కాదు.. శ్రీరామ్‌ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండటం లేదు.  బిగ్ బాస్ హౌస్‌కి శ్రీరామ్ కెప్టెన్ అయినప్పటికీ అధికారం మొత్తం ఈమెదే అన్నట్టుగా వ్యవహరిస్తుంది.  అందరూ పడుకున్న తరువాత శ్రీరామ్-హమీదాలు సైలెంట్‌గా లేచి రొమాన్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకర్నొకరు కౌగిలించుకుని రొమాన్స్‌‌లో తేలిపోయారు. హమీదా అయితే శ్రీరామ్‌ కౌగిలి నుంచి బయటకు రావడానికి అస్సలు ఇష్టపడలేదు. పడుకుంటూ కూడా శ్రీరామ్‌కి ఎయిర్ కిస్‌లు పంపింది. శ్రీరామ్ కూడా దానికి తగ్గట్టుగానే రియాక్ట్ అయ్యాడు.

మొత్తానికి వీళ్లని   చూస్తే గత సీజన్‌లో అఖిల్, మోనాల్‌ల మాదిరే హద్దులు దాటేసేటట్టుగానే ఉన్నారు.  హమీదా ఎలిమినేట్ అయితే మాత్రం శ్రీరామ్‌కి మంచి రోజులు వచ్చినట్టే. లేదంటే బిగ్ బాస్ ఇచ్చిన లవ్ ట్రాక్‌లో ఇరుక్కుని గత సీజన్‌లో మోనాల్-అఖిల్ మాదిరి    పరిస్థితి వచ్చేది. మరి హమీదా ఎలిమినేషన్‌తో అయితే శ్రీరామ్ క్లీన్ ఇమేజ్‌తో బయటపడతాడేమో చూడాలి.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More