బిగ్ బాస్ 5 తొమ్మిదో వారం ఎలిమినేషన్లో ఎవరూ ఊహించని హౌస్‌మేట్ ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 5కు 19 మంది ఎంట్రీ ఇవ్వగా విశ్వతో కలిపి ఇప్పటికి తొమ్మిదిమంది ఎలిమినేట్ అయ్యారు. విశ్వ ఎలిమినేషన్ బిగ్ బాస్ ప్రేక్షకులను ఒకింత షాక్‌కు గురిచేసింది. ఏ రకంగా చూసుకున్నా.. విశ్వ కొందరు ఇతర హౌస్‌మేట్స్‌తో పోలిస్తే స్ట్రాంగ్ అని చాలామంది ప్రేక్షకుల అభిప్రాయం. ‘అందరికీ సూపర్ ఎగ్జయిట్మెంట్ ఉన్న వార్త!..
హౌస్‌లో నుంచి ఊసరవెల్లి బయటకు వచ్చేసింది. ఎందుకంటే అది చేసిన పాపాలు పండాయి కాబట్టే ఇలా జరిగింది’ అని వ్యంగ్యంగా మాట్లాడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నటరాజ్ మాస్టర్‌ను ఏకిపారేస్తున్నారు. ‘మరి నువ్వెందుకు నాలుగో వారంలోనే బయటకు వచ్చావు? అంటే తమరెన్ని పాపాలు చేశారో!’, ‘మీ పాపం నాలుగో వారంలోనే పండింది’, ‘నువ్వు విశ్వ ఆడినదాంట్లో సగం కూడా ఆడలేదు, పైగా పోజులు కొడుతున్నావ్’, ‘నీ సోది జంతువులకు చెప్పుకోపో’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నంత కాలం తన ఆటతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు నటరాజ్. ఇక హౌస్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత పూర్తిగా తన ఫ్యామిలీతోనే గడపడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్‌గా ఎన్నో రియాలిటీ షోలు, స్టేజ్ షోలు చేసిన నటరాజ్ మాస్టర్ కెరీర్ ఇటీవల కాస్త స్లో అయ్యింది. ఇన్నాళ్ల తర్వాత బాలకృష్ణ లాంటి టాప్ హీరోతో ఛాన్స్ రావడం తన కెరీర్‌కు చాలా ప్లస్ అవుతుంది అనుకుంటున్నాయి సినీ వర్గాలు.