మండే- అదే సోమవారం… ఎలిమినేషన్ కి నామినేషన్ వేసే రోజు…!!!
ఐదు రెట్ల ఫన్, ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్, ఐదు రెట్ల కాంట్రవర్శీ, ఐదు రెట్ల ఎఫైర్స్, ఐదు రెట్ల డ్రామా గ్యారెంటీ.. అంటూ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్. సోమవారం వచ్చిందంటే చాలు ఎక్కడలేని కోపాలు ప్రదర్శిస్తుంటారు. వారమంతా కలిసే ఉంటారు.చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపిస్తూ నానారభస చేస్తుంటారు. కంటెస్టెంట్ల మధ్య వైరం పెరిగేది, మిత్రువులు కూడా శత్రువులుగా మారేది ‘మండే’ రోజే.
ఈ వారం కూడా నామినేషన్స్‌తో భగభగ మండిపోతోంది బిగ్‌బాస్ హౌస్. ప్రతిసారి చెత్త చెత్త రీజన్లతో నామినేట్ చేస్తారంటూ చిరాకు పడింది ప్రియాంక సింగ్.టాస్క్‌లో నా జేబులో నుంచి కాయిన్లు దొంగతనం చేశాడంటూ లోబో జెస్సీని నామినేట్ చేశాడు. తాను గేమ ఆడటానికి వచ్చానని, నమ్మకంతో పని లేదంటూ కౌంటరిచ్చాడు.
అవసరానికి తగ్గట్టు రిలేషన్షిప్ వాడుకోకండి అంటూ సిరిని నామినేట్ చేశాడు శ్రీరామ్. షణ్ముఖ్‌ను సైతం నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. షణ్ముఖ్ నామినేషన్‌ను జీర్ణించుకోలేకపోయినట్లే కనిపిస్తోంది. వీళ్ళిద్దరి మధ్యా పెద్ద యుద్ధమే జరిగినట్లు అనుమానంగా ఉంది. ప్రియ ఉన్నన్ని రోజులు తప్పకుండా ఆమెనే నామినేట్ చేస్తానన్నాడు సన్నీ. అతడి మాట విని అవాక్కైన ప్రియ.. వార్నింగ్ ఇస్తున్నావా? అంటూనే అతడి ఫొటోను మంటల్లో వేసింది. మొత్తానికి వాడివేడిగా సాగనున్న ఈ నామినేషన్స్‌లో ఎవరెవరు ఉండబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.