బిగ్‌బాస్ 5 : బిగ్‌బాస్ ఇంట్లో ఈ వారం గొడవల మోతాదు కాస్త ఎక్కువైంది. ఐదు వారాలను దిగ్విజయంగా ముగించుకొని ఆరో వారంలోకి అడుగుపెట్టింది. నిన్న జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు. దీంతో హౌస్ అంతా గంభీరంగా మారిపోయింది. ప్రతి సోమవారం బిగ్‌బాస్ ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉండడం కామన్. అయితే ఈ వారం గొడవల మోతాదు కాస్త ఎక్కువైంది. దీంతో బిగ్‌బాస్ ఇంటి సభ్యులను కూల్ చేసే పనిలో పడినట్లు లేటెస్ట్ ప్రోమో చూస్తే అర్థమవు తుంది. సన్నీ అయితే ఎప్పటి మాదిరే తనదైన పంచులతో ఇంటి సభ్యులను నవ్వించాడు.
శ్రీరామ్‌ను ఇమిటేట్ చేస్తూ పలకించిన హావభావాలు హౌస్‌లో నవ్వులు పూయించాయి. అలాగే హమిదా ఎలా అరుస్తుందో చేసి చూపించేసరికి అందరూ పెద్ద ఎత్తున నవ్వుకున్నారు. మరోవైపు కాజల్, శ్రీరామ్‌లు మధ్య నామినేషన్ ప్రక్రియ చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. నిన్నటి నామినేషన్‌కి బాగా హర్ట్ అయిన కాజల్.. శ్రీఆమ్ని ఉద్దేశిస్తూ.. ‘బ్రేకప్ బ్రో.. చరిత్రలో బ్రదర్ అండ్ సిస్టర్ బ్రేకప్ ఫస్ట్ టైమ్ కదా’ అంటూ చెప్పుకొచ్చింది. షణ్ముఖ్, జెస్సీ, సిరి – ఎప్పటి మాదిరే ఇతర సభ్యులపై పంచులేశారు.
ఫన్నీగా కూల్‌గా సాగిపోతుందనుకుంటున్న సమయంలో శ్వేత వర్మ బిగ్గర అరవడంతో హౌజ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇతరుల్లోని అగ్లీ సైడ్‌ను బయటకు తీసుకురావడం గేమా అంటూ అరిచేసింది, ఇది ఎలా కరెక్ట్ అవుతుంది, అస్సలు కాదంటూ అరిచేసింది. ఇలా కొంచెం ఫన్నీగా, కొంచెం హాట్ హాట్‌గా సాగిన నేటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.