TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » Bigg Boss Telugu » ఈ కేక్ ముక్క తినే ‘అర్హత’ ఎవరికుంది?.. బిగ్ బాస్ కొత్త ప్రోమోలో ట్విస్ట్!..

ఈ కేక్ ముక్క తినే ‘అర్హత’ ఎవరికుంది?.. బిగ్ బాస్ కొత్త ప్రోమోలో ట్విస్ట్!..

by Murthy

టాస్క్ లతో కుటుంబ సభ్యుల మధ్య ఊహించని గొడవలతో, వారి మధ్య బాండింగ్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. అయితే హౌస్ లో నుంచి జెస్సీ బయటకు వెళ్లడం షాకింగ్ గా మారింది. ఇక లేటెస్ట్ ప్రోమోలో కూడా ఆసక్తి గా మార్చాడు బిగ్ బాస్. కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్‌ ఓ డిష్ ని పంపాడు. హౌస్ గార్డెన్ మధ్యలో ఓ టేబుల్ వేసి ఆ డిష్ ని పెట్టి దాని పై గ్లాస్ మూతని బోర్లించాడు. ఓ చిన్న కేక్ ముక్కలాగా ఉంది. ఈ డిష్ తో పాటు ఓ నోట్ కూడా అక్కడ పెట్టాడు. ”నోరూరించే ఫుడ్‌ ఐటమ్‌ను పంపి ‘ఇది తినే అర్హత మీలో ఏ ఒక్కరికి ఉంది?’’ అంటూ ఓ నోట్ పెట్టాడు. ఇంటిసభ్యులు దీని వెనకాల ఏమైనా మతలబు ఉందా? అని బుర్రలు బద్ధలు చేసుకున్నారు. ఇది చూసిన సన్నీ ‘ఈ తొక్కలో డిస్కషన్‌ ఏంటో అర్థం కావడం లేదు, పోనీ నేను లటుక్కుమని తినేయనా?’ అని అడిగాడు. కాజల్‌ అందుకు పచ్చజెండా ఊపినప్పటికీ యానీ మాస్టర్‌ మాత్రం వద్దని వారించింది.

ఇక శ్రీరామ్‌ అయితే దాని చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. చివరగా యానీ తాను కెప్టెన్‌ను కాబట్టి తినడానికి తనకే అర్హత ఉందని చెప్పింది. అయితే ఇంటిసభ్యుల అభిప్రాయం కూడా కనుక్కుందామని చూసింది. ఇంతలో ప్రియాంక – నాకు మానస్‌కు ఇవ్వాలని ఉంది అనగానే – సన్నీ ‘నువ్వు అన్నీ మానస్‌కే ఇచ్చుకో, పో లోపలికి’.. అని ఫన్నీ కౌంటర్‌ ఇచ్చాడు. మరి ఈ కేక్‌ ఎవరు తిన్నారు? అసలు తిన్నారా? లేదా? అనేది తెలియాలంటే నేటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More