TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » Bigg Boss Telugu » ఎవరికి ఎవరూ-చివరికి ఎవరూ!?. బిగ్ బాస్ టాస్క్ కిక్కో కిక్కూ!!.

ఎవరికి ఎవరూ-చివరికి ఎవరూ!?. బిగ్ బాస్ టాస్క్ కిక్కో కిక్కూ!!.

by Murthy

ఈవారం బిగ్ బాస్ లో దెబ్బలాటలు చాల వెరైటీగా ఉన్నాయి. ఒకరిమీద ఒకరికి చిరాకూ, కోపం ఎలిమినేషన్ పట్ల భయం కొందరిలో స్పష్టంగా కనిపిస్తోంది. నామినేషన్స్‌ ఎఫెక్ట్‌తో ప్రియాంక సింగ్‌ మీద మొదలుపెట్టాడు మానస్‌. ఆమె దగ్గరవ్వాలని ప్రయత్నించేకొద్దీ అతడు తప్పించుకు తిరిగాడు. నేనేమైనా తప్పు చేస్తే చెప్పంటూ బతిమాలినప్పటికీ మానస్‌ మాత్రం అసలు పట్టించుకోలేదు. దీంతో పింకీ.. మానస్‌ ఎందుకు మాట్లాడట్లేదో తెలియడం లేదని తెగ ఫీలైంది. ఇది విన్న కాజల్‌.. నువ్వు తనకోసం వచ్చావా? అని ఫైర్‌ అయింది. మనం గేమ్‌ ఆడటానికి వచ్చాం, మానసే నేరుగా వచ్చి మాట్లాడేదాకా వెయిట్‌ చెయ్‌, లేదంటే వదిలెయ్‌ అని సలహా ఇచ్చింది.  ఈవారం ఎలిమినేట్‌ అవుతానని అటు కాజల్‌, ఇటు మానస్‌ ఎవరికి వారే అభిప్రాయపడ్డారు. అయితే మానస్‌ వెళ్లిపోతాడంటే తట్టుకోలేక పోయిన పింకీ.. అలా అనొద్దని వేడుకుంది. దీంతో చిర్రెత్తిపోయిన సన్నీ.. నువ్వు మాట్లాడే అధికారమే కోల్పోయావని తేల్చేశాడు.

ఇక కాజల్‌ నామినేషన్స్‌ సమయంలో వారిని సేవ్‌ చేయకుండా నమ్మకాన్ని వమ్ము చేసినందుకు సారీ చెప్పింది. ఎప్పటిలా ఉందామని ఎన్నిసార్లు బతిమాలినా, ఎన్నిసార్లు సారీ చెప్పినా సన్నీ, మానస్‌ వినిపించుకోకపోవడంతో తను కూడా ఏడ్చేసింది. జెస్సీ ఉన్నఫళంగా హౌస్‌ వదిలి వెళ్తాడని చెప్పగానే షణ్ముఖ్‌, సిరి గుక్కపెట్టి ఏడ్చారు. సిరి అయితే అతడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని తలపై ఆప్యాయంగా ముద్దు పెట్టింది. జెస్సీ వెళ్లిపోయే ముందు చివరిసారిగా హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతూ నా ఆరోగ్యం బాగోలేనప్పుడు సన్నీ, మానస్‌, పింకీ, కాజల్‌, యానీ అందరూ పాంపరింగ్‌ చేశారంటూ బాధపడ్డాడు. తన ఫ్రెండ్స్‌ షణ్ను, సిరి ఇద్దరు ఉన్నంతవరకు బిగ్‌బాస్‌ జర్నీ చూస్తానని చెప్తూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడు లేకపోవడంతో తీవ్రంగా దుఃఖించిన సిరి  జెస్సీ తిరిగొస్తాడేమోనని ఆశాభావం వ్యక్తం చేసింది.

సిరి అందరిముందే తన మీద జోకేసిందని తెగ ఫీలయ్యాడు షణ్ను. ఎవడన్నా జోకేస్తే చెప్పు తీసి కొట్టేవాడినని చిరాకుపడ్డాడు. క్లోజ్‌ ఫ్రెండే జోకేస్తే తీసుకోని షణ్ను రవి జోక్‌ చేస్తే ఊరుకుంటాడా? అందరి ముందు తన డ్యాన్స్‌ను ఇమిటేట్‌ చేయడంతో బాగా హర్టయ్యాడు.  బిగ్ బాస్ హౌజ్ లో ఇప్పుడు మంట బాగా రగులుతోంది… వీకెండ్ వరకూ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో?? వెయిట్ & సీ

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More