బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5న ఘనంగా మొదలైన సంగతి తెలిసిందే. హీరో నాగార్జున మూడోసారి ఈ షోను నడిపించే బాధ్యత తీసుకున్నారు. బుల్లితెరపై అతి పెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్.. ఈసారి నాగార్జున హోస్ట్‌గా మూడో సీజన్‌తో సర్వాంగ సుందరంగా ముస్తాబై, బుల్లితెర వీక్షకుల ముందుకు వచ్చేసింది. 15 మంది కంటెస్టెంట్స్.. వారికి తోడుగా కింగ్ నాగార్జున.. ఇకనేం, బుల్లితెరపై కావాల్సినంత ఎంటర్టైన్మెంట్. ఓపెనింగ్ ఈవెంట్ అదిరిపోయింది. కళ్ళు చెదిరే పెర్ఫామెన్స్లతో హౌస్మేట్స్ సత్తా చాటారు. ఆ తర్వాత హౌస్‌లోకి ఎంటరవుతూనే, వివాదాలు షురూ చేశారు. బిగ్‌బాస్ ఈసారి హౌస్మేట్స్ మధ్య నిజమైన మంట పెట్టాడు. సోమవారం తమకు ఇష్టం లేని, ఇంట్లో ఉండేందుకు అర్హతలేని ఇద్దరు ఇంటి సభ్యులను నామినేట్ చేసి, వారి ఫొటోను మంటలో వేసి కాల్చేయాల్సిందిగా సూచించాడు. ఈ క్రమంలో హౌస్మేట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
‘అక్కా తొక్క.. చెప్పి రిలేషన్స్ కొనసాగించవద్దు.. స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా ఉండండి’ అంటూ అనీ మాస్టర్ విశ్వపై మండిపడ్డారు. ‘నామినేషన్ చేసి వెళ్లు. వివరణ ఇవ్వొదు’ అని సిరి అనగా, ‘నేను ఏం చేయాలో నువ్వు చెప్పొద్దు’ అని శ్వేత కౌంటర్ ఇచ్చింది. ‘నువ్వు వచ్చి నీళ్లు పోయగానే నా హృదయం బద్దలైంది’ అంటూ మానస్‌ను రవి నామినేట్ చేశాడు. ఇక ‘నాకు గేమ్ ఆడటం రాదని అన్నావు. నేను ఆడితే తట్టుకోలేవు’ అని అంటూ జెస్సీని ఉద్దేశించి, సన్నీ సవాల్ విసిరాడు. ఈ వారం ఎవరెవరు నామినేట్ అవుతారు? తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే!