TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » Bigg Boss Telugu » బిగ్ బాస్’ ఫేమ్ ‘గంగవ్వ’ – సొంతింటి కల సాకారమయ్యింది!..

బిగ్ బాస్’ ఫేమ్ ‘గంగవ్వ’ – సొంతింటి కల సాకారమయ్యింది!..

by Murthy

కష్టాలు వచ్చాయని ఆత్మహత్యలు చేసుకుంటే పరిష్కారం దొరకదు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చనే మాటకి నిలువుటద్దం గంగవ్వ. సాధారణ పల్లెటూరి మహిళగా ఉన్న గంగవ్వ – ‘మై విలేజ్ షో యూట్యూబ్ చానల్’ తో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆపై బిగ్ బాస్ రియాలిటీ షోతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దగ్గరైంది. గంగవ్వ తన కల నెరవేర్చుకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బిగ్ బాస్-4 సభ్యులు అఖిల్, శివజ్యోతి, మై విలేజ్ షో యూట్యూబ్ చానల్ సభ్యులు, గంగవ్వ బంధుమిత్రులు, గ్రామస్థులు హాజరయ్యారు. బిగ్ బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్‌గా అందర్నీ ఆకట్టుకున్న గంగవ్వ అనారోగ్య కారణాలతో బయటకు వచ్చేసింది. వచ్చే ముందు తనకు ఓ ఇల్లు కావాలనే చిరకాల కోరికను హోస్ట్ నాగార్జున ముందు ఉంచింది.

దీంతో గంగవ్వకు నాగార్జున ఇల్లు కట్టిస్తానని ఇచ్చిన మాట నిలుపుకుంటూ ఆయన రూ.7 లక్షలు అందించగా, బిగ్ బాస్ షో నుంచి రూ.11 లక్షలు, సొంతడబ్బు మరో రూ.3 లక్షలు కలుపుకుని తన స్వగ్రామంలో లంబాడిపల్లిలో అందమైన ఇంటిని నిర్మించుకుంది. సొంత ఇంట్లోకి ప్రవేశించిన క్షణాన గంగవ్వ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో పోస్టు చేస్తే వేలల్లో వ్యూస్ వస్తున్నాయి. ఈ సందర్భంగా నాగార్జునకు, బిగ్ బాస్ టీంకు గంగవ్వ ధన్యవాదాలు తెలిపింది.

యూట్యూబ్ స్టార్‌గా మారక ముందు గంగవ్వ ఎన్నో కష్టాలు పడింది. చదువుకొని ఆమె బీడీలు చుడుతూ కుటుంబానికి అండగా నిలిచింది. భర్త తాగుబోతు కావడంతో ఆమె ఎంతో కష్టపడి ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకును పెంచి పెద్ద చేసింది. గంగవ్వకు ఊహ తెలియక ముందే ఆమె తండ్రి చనిపోయాడు. 13 ఏళ్లొచ్చాక తల్లి మరణించింది. దీంతో తమ్ముళ్ల బాధ్యతను ఆమే తీసుకుంది. భర్త తాగుడుకు బానిస కావడంతో రోజూ గొడవలయ్యేవి. పగలు కూలీ పనులకు వెళ్తూ.. రాత్రి పూట బీడీలు చుడుతూ పిల్లలను పెంచింది. 16 ఏళ్ల క్రితం గల్ఫ్‌కి వెళ్లిన భర్త నయాపైసా పంపలేదు. ఆయన అక్కడే చనిపోయాడని తర్వాత తెలిసింది.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More