బిగ్‌బాస్, ఈసారి నామినేషన్స్ సందర్భంగా హౌస్మేట్స్ మధ్య ‘మంట’ పెట్టాడు. హౌస్‌లో ఉండేందుకు అర్హత లేని, తమకు ఇష్టం లేని ఇద్దరు ఇంటి సభ్యుల ఫొటోలను మంటలో వేసి కాల్చేయాలని ఆదేశించాడు. నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టిన సన్నీ.. రవి, జెస్సీలను నామినేట్ చేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ తనని నామినేట్ చేయడం ఇష్టం లేదని అనీ మాస్టర్‌ను విశ్వ నామినేట్ చేశాడు. దీంతో అనీ మాస్టర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘ఇక నుంచి నన్ను అక్కా.. తొక్కా అని పిలవద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ప్రియాంకను నామినేట్ చేశాడు. ఇక రాజుల టాస్క్ సందర్భంగా జెస్సీ, ప్రియాంకలు తన నమ్మకాన్ని వమ్ము చేశారంటూ లోబో వారిని నామినేట్ చేశాడు. తాను గేమ్ ఆడటానికి వచ్చానని లోబోకు జెస్సీ కౌంటర్ వేశాడు. శ్రీరామ్‌ని సిరి నామినేట్ చేసింది. శ్వేత ఫొటోను మంటల్లో వేస్తూ.. ‘నా గేమ్ నా ఇష్టం, ఏం చేయాలో నువ్వు నాకు చెప్పకు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. లోబో, విశ్వలను ప్రియాంక నామినేట్ చేసింది. ‘చిన్న చిన్న కారణాలు చెప్పి నామినేట్ చేయడం, నమ్మకం గురించి మాట్లాడానికి సిగ్గుండాలి’ అంటూ లోబో ఫొటోను చించి మరీ మంటల్లో వేసింది. బుద్ధిబలం కూడా ఉపయోగించాలంటూ విశ్వకు సలహా ఇచ్చింది. వెధవ రీజన్లు ఇవ్వకండి అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ షణ్ముఖ్, విశ్వలను అనీ మాస్టర్ నామినేట్ చేసింది. ఇక్కడ కూడా విశ్వ-అనీల మధ్య వాగ్వాదం జరిగింది.
శ్రీరామ్ సిరిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత షణ్ముఖ్‌ను నామినేట్ చేసి, చెప్పటానికి ప్రయత్నించగా, ‘అంటే బిగ్‌బాస్‌లో నువ్వు దేవుడివా. నువ్వు చెప్పినట్లు వినాలా’ అంటూ షన్ను ఫైర్ అయ్యాడు. ప్రియ మరోసారి సన్నీని నామినేట్ చేసింది. బిగ్‌బాస్ మొదలైనప్పటి నుంచి ప్రియ వదలకుండా సన్నీని నామినేట్ చేస్తూనే ఉంది. ఈ వారం కూడా నామినేట్ చేయడంతో సన్నీ మొదట నవ్వుకున్నాడు. ఆ తర్వాత ‘మీరు హౌస్‌లో ఉన్నన్ని రోజులు 100శాతం మిమ్మల్ని నామినేట్ చేస్తా. ఇది గ్యారెంటీ’ అని ప్రియతో సన్నీ అనగా, ‘ఏంటి బెదిరిస్తున్నావా’ అని ప్రియ అంది. ‘లేదు నా గేమ్ గురించి చెబుతున్నా. చూసుకోండి’ అన్నాడు. విశ్వను ప్రియ నామినేట్ చేసింది. వాడీవేడీ చర్చల మధ్య ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. షణ్ముఖ్, ప్రియాంక, లోబో, శ్రీరామ్, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. మరి ఈ వారం ఎవరు సేవ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే!