TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » Bigg Boss Telugu » బిగ్ బాస్ లో ప్రియాంకకి బావలెంతమంది?!.

బిగ్ బాస్ లో ప్రియాంకకి బావలెంతమంది?!.

by Murthy

ఈవారం కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసంబిగ్‌బాస్‌ హౌస్‌లో టాస్క్‌   మొదలైంది. అంతకుముందు ఇంటి నుంచి తనకు వచ్చిన లెటర్‌ చూసి సన్నీ భావోద్వేగానికి గురయ్యాడు. మరికొందరి ఇంటి సభ్యులకు వచ్చిన లేఖలు ముక్కలైపోతుంటే చాలా బాధగా అనిపించిందని సన్నీ-కాజల్‌ మాట్లాడుకున్నారు.  ప్రియాంక పెద్దబావ, చిన్నబావ, బుల్లిబావల విషయంలో రవి, లోబోల మధ్య సరదా సంభాషణ జరిగింది.   ట్రాన్స్‌ జెండర్‌ కంటెస్టెంట్‌గా పరిచయం అయినా ప్రియాంక… తన అంద చందాలతో బిగ్ బాస్ హౌస్‌లోనే గ్లామర్ బ్యూటీగా అవతరించిన ప్రియాంక స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారింది. మానస్‌తో ఆమె నడిపే లవ్‌ట్రాక్‌.. ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. వారిద్దరిపై మిగతా సభ్యులు వేసే పంచ్‌లు, జోకులు బాగా పేలుతున్నాయి. తాజా ఎపిసోడ్‌లో ప్రియాంక పెద్దబావ, చిన్నబావ, బుల్లిబావల విషయంలో రవి, లోబోల మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వులు పూయించాయి.

హౌస్‌లో ఉన్న ఇంటి సభ్యుల్లో ఓ ముగ్గుర్ని ప్రియాంక బాగా కవర్‌ చేస్తుందని వీళ్లు సరదాగా జోక్‌ చేసుకున్నారు. ప్రియాంకకు శ్రీరామ్‌ పెద్ద బావ.. మానస్‌ చిన్న బావ.. జెస్సీ బుల్లిబా.. అంటూ లోబోకు రవి వివరించడం నవ్వులు పూయించింది. ఈ మొత్తం సంభాషణ విని ప్రియాంక సైతం సరదాగా నవ్వుకుంది. ఈ సందర్భంగా లోబో.. ప్రియాంకతో మాట్లాడుతూ.. ‘‘నీ మాట వినని పెద్దబావ కాళ్లూచేతులు తీసేస్తాను’’ అని అంటే ‘‘అయ్యయ్యో అలా చేయవద్దు అన్నయ్య’’ అని ప్రియాంక బతిమలాడుకుంది. చిన్నబావ అన్ని విషయాల్లోనూ అడ్జెస్ట్‌ అవుతాడని చెప్పుకొచ్చింది. ‘‘నీకు కూడా అతడే కదమ్మా కావాల్సింది’’ అని రవి కౌంటర్‌ ఇవ్వడం నవ్వులు పూయించింది.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More