ఈసారి నామినేషన్ ప్రక్రియను సరికొత్త డిజైన్ చేసింది బిగ్‌బాస్ టీమ్. ‘ఈ రోజు నుంచి మీకు ఎంతో ప్రియమైన వారి నుంచి ఒక లేఖను పొందే అవకాశం వస్తుంది. కానీ, జీవితంలో మనం కోరుకున్నది ప్రతిదీ, మనకు దక్కదు. దానికి బదులుగా ఏదైనా వదులుకోవాల్సి వస్తుంది. ఎవరికైతే పవర్ రూమ్‌లో ఉన్న సభ్యులు లేఖను ఇస్తారో వారు ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అవుతారు. లేఖ లభించని సభ్యులు నామినేట్ అవుతారు’ అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. షో మొదలై అప్పుడే 50 రోజులు పూర్తైందని.. మీకు ఎంతో ప్రియమైన నుంచి లేఖను పొందే అవకాశం లభిస్తుందని చెప్పాడు బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా.. పోస్ట్ మ్యాన్ ఇద్దరు ఇంటి సభ్యులను పవర్ రూంకు పిలుస్తుంటాడు. వారి ముందున్న బ్యాగ్ లో రెండు లేఖలు ఒకరికి మాత్రమే ఇచ్చి మిగతాది చింపివేయాల్సి ఉంటుంది. లెటర్ తీసుకోని వాళ్లు నామినేట్ అయినట్లు అని తెలిపాడు.
కెప్టెన్ సన్నీకి స్పెషల్ పవర్ లభించింది. జెస్సీ లెటర్ తీసుకొచ్చి, అది జెస్సీ చదవాలంటే ఇప్పటికే లెటర్ పొందిన వారు దాన్ని త్యాగం చేసి, నామినేషన్స్‌లో ఉండాలని బిగ్‌బాస్ చెప్పాడని వివరించాడు. దీంతో శ్రీరామ్ తన లెటర్‌ను త్యాగం చేశాడు. అయితే, మధ్యలో రవి కలగజేసుకుని, శ్రీరామ్‌తో షణ్ముఖ్, సిరి, జెస్సీల మధ్య దూరం ఏర్పడిందని, అది పోవాలంటే శ్రీరామ్‌ను హగ్ చేసుకోవాలని షరతు పెట్టాడు. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. తమ మధ్య సమస్యలు లేవీ లేవని చెప్పారు. చివరిగా కెప్టెన్ సన్నీకి ఎలాంటి కండీషన్స్ లేకుండా లెటర్ రావడంతో దాన్ని చదివి ఆనందం పడ్డాడు. అలా ఈ వారం రవి, లోబో, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్, మానస్లు నామినేట్ అయ్యారు.
ఈ వారం నామినేషన్ ప్రక్రియను హౌస్ మోట్స్ ఎమోషన్స్‌తో జత చేశాడు బిగ్ బాస్. ఇక ఈ వారం ఇంటి నుంటి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు లోబో, సిరి, మానస్, షణ్ముఖ్, శ్రీరామ్, రవి ఉన్నారు.