బిగ్ బాస్ ప్రేక్షకులు సోమవారం కోసం వేచి చూస్తుంటారు. ఆ రోజు నామినేషన్స్ ఉంటాయి. ఈ వారం కూడా వేడిగానే నామినేషన్స్ జరిగాయి. దీపావళి సెలెబ్రేషన్స్‌లో కంటెస్టెంట్లు మునిగిపోయారు. పటాక జోడి అంటూ ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు. అది ఎపిసోడ్ మొత్తం సాగింది. ఈ వారం నామినేషన్స్‌కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ముఖానికి క్రీమ్ రాసి హౌస్‌లో ఉండటానికి అర్హతలేని వాళ్లని సరైన రీజన్ చెప్పి ఒక్కొక్కరూ ఇద్దరిద్దర్ని నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. దీనిలో భాగంగా.. మానస్-శ్రీరామ్‌లు ఒకర్నొకరు నామినేట్ చేసుకుంటూ కనిపించారు. ఇక సిరి అయితే సన్నీని నామినేట్ చేసింది. ఇక ఈ మధ్యనే షణ్ముఖ్ సైన్యంలో సభ్యుడిగా జాయిన్ అయిన రవి.. మానస్‌ని నామినేట్ చేస్తూ కనిపించాడు. అయితే సిరి.. సన్నీని నామినేట్ చేస్తుందంటే అంతకు ముందో తరువాతనో షణ్ముఖ్ కూడా సన్నీనే నామినేట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే గత నామినేషన్స్ అన్నీ షణ్ముఖ్ ఎవర్ని నామినేట్ చేస్తే సిరి కూడా వాళ్లనే నామినేట్ చేస్తూ వస్తున్నాడు.
ఇక జెస్సీకి కూడా అదే దారి. ఇక రవి కాజల్‌ని.. సిరి సన్నీతో పాటు ఆనీ మాస్టర్ని నామినేట్ చేస్తున్నట్టుగా ప్రోమోలో చూపించారు. ప్రోమో చూస్తుంటేనే ఆ వేడి బయటికి తెలుస్తుంది. ఈ సారి బిగ్ బాస్ 5 తెలుగు నామినేషన్స్‌లో కొత్త రికార్డు సృష్టించారు కంటెస్టెంట్స్. కెప్టెన్ తప్ప అంతా నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లో 11 మంది సభ్యులు ఉన్నారు. 19 మంది వస్తే.. ఇప్పటి వరకు 8 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. తాజాగా లోబో బయటికి వచ్చేసాడు. ఇక ఇంట్లో ఉన్న 11 మందిలో కెప్టెన్ షణ్ముఖ్ మాత్రమే మినహాయించి 10 మంది నామినేట్ అయ్యారు.