బిగ్‌బాస్ : కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్ ముగిసిందని బిగ్‌బాస్ ప్రకటించడంతో ఇంటిసభ్యులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఎవరి దగ్గర ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయో లెక్కపెట్టమని బిగ్‌బాస్ సూచించాడు. కోడిగుడ్లు ఎక్కువగా సేకరించి మానస్, విశ్వ, సన్నీ, జెస్సీ, శ్రీరామ్‌లు టాప్ ఫైవ్‌లో నిలిచారు. ఈ సందర్భంగా జెస్సీకి ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చినట్లు బిగ్‌బాస్ ఇంటి సభ్యులందరికీ చెప్పాడు. సీక్రెట్ టాస్క్‌లో గెలిచాననే ఆనందంతో ఉన్న జెస్సీకి ఊహించని షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇంట్లో ఉన్న ఎవరైనా ముగ్గురు వ్యక్తుల దగ్గర గుడ్లు దొంగించడం లేదా నాశనం చేయాలని చెబితే.. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వాళ్ల సాయం అడిగినందుకు జెస్సీని బిగ్‌బాస్ డిస్క్వాలిఫై చేశారు.
జెస్సీ ఆడింది సీక్రెట్ టాస్క్ అని తెలిసి.. ప్రియ-ప్రియాంకలు షాక్ అయ్యారు. దీంతో కెప్టెన్సీ పోటీదారుల నుంచి జెస్సీ వెళ్లిపోయి.. ఆయన స్థానంలో రవి వచ్చాడు.సీక్రెట్ టాస్క్‌ను సరిగ్గా అర్థం చేసుకోకుండా జెస్సీ విఫలం కావడంతో షణ్ముఖ్ అసహనం వ్యక్తం చేశాడు. సిరి, జెస్సీ కారణంగా తాను కెప్టెన్సీ పోటీ నుంచి వైదొలగాల్సి వచ్చిందని.. వాళ్లిద్దరూ తనకు అన్యాయం చేశారంటూ షణ్ముఖ్ కేకలు వేశాడు. ‘‘మిమ్మల్ని ఫ్రెండ్స్ అనుకుంటే నన్ను బాగా మోసం చేశారు. నేను దేనికి పనికిరాను. నాకు ఆట ఆడటం రాదు. ప్రతివాడితోనూ మాటలు పడాల్సివస్తుంది’’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
స్పెషల్ ఎగ్ దక్కించుకున్న శ్రీరామ్ కి టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. రెండు బాతులను ప్లేట్స్ పై పెట్టుకుని ఎవరి బొమ్మని వాళ్లు కాపాడుకుంటూనే మరొకరు గెలవకుండా చూసుకోవాలి. ఈ టాస్క్ లో శ్రీరామ్-ఆనీ మాస్టర్ పోటీ పడగా విజేతగా నిలిచిన ఆనీ మాస్టర్ ఐదు అదనపు ఎగ్స్ దక్కించుకున్నాడు. గురువారం ఎపిసోడ్ లో లోబో హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు.