హైదరాబాద్: విరుష్క జోడి ఈ రోజు ఫాన్స్ తో ఒక శుభవార్త షేర్ చేసుకున్నారు అదేంటంటే విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మేము త్వరలోనే ముగ్గురం కాబోతున్నాం అనే న్యూస్ షేర్ చేస్తూ భార్య అనుష్క శర్మ తో పాటు ఉన్న ఫోటో ట్వీట్ షేర్ చేసాడు.
సోషల్ మీడియా ద్వారా విరాట్ అనుష్క మేము జనవరి 2021కి ముగ్గురం కాబోతున్నాం అని తెలియజేశారు. విరాట్ షేర్ చేసిన న్యూస్ ప్రకారం అనుష్క ఇప్పుడు నాలుగు నెలల ప్రేగ్నన్ట్ అని తెలుస్తుంది. వారికి కొన్ని కోట్లమంది అభిమానులు ఫాలోయర్స్ ఉండడం వల్ల ఈ విషయం సోషల్ మీడియా లో ట్రేండింగ్ అవుతుంది.
మార్చ్ నుండి లొక్డౌన్ ఉండడం వల్ల అనుష్క పూర్తిగా తన ఇంటికే పరిమితం అయ్యింది , కాబట్టి ఈ న్యూస్ ఎప్పటి వరకు బయటకు రాలేదు ఇప్పుడు అనుష్క శర్మ గర్భవతి అన్న విషయం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అలాగే ఐపీఎల్ వాయిదా పడడం వాళ్ళ విరాట్ కుడా ఇంటికే పరిమితం అయ్యారు.
ఈ క్రేజ్ జోడి ని విష్ చేస్తూ ట్విట్టర్ లో అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు వాళ్లకు విషెస్ తెలియ జేస్తున్నారు. విరాట్ కోహ్లీ షేర్ చేసిన ఫోటో లో అనుష్క బేబీ బంప్ తో కనిపిచింది.