TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » సీనియర్ నటుడిపై రంగమ్మత్త ఫైర్!..

సీనియర్ నటుడిపై రంగమ్మత్త ఫైర్!..

by Murthy

తన వస్త్రధారణపై కామెంట్‌ చేసిన ఓ సీనియర్‌ నటుడిపై అనసూయ ఫైర్‌ అయ్యారు. ఎవరికి ఇష్టమొచ్చిన దుస్తులు వారు ధరిస్తారని, అది వ్యక్తిగతమని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ పెట్టారు. ‘నా వస్త్రధారణ గురించి ఓ సీనియర్‌ యాక్టర్‌ చేసిన కామెంట్లని ఇప్పుడే చూశా. నటుడిగా అపారమైన అనుభవం ఉన్న ఆయన అలా మాట్లాడం బాధ కలిగించింది. దుస్తులు ధరించటమనేది వ్యక్తిగత అంశం. ఎవరికి నచ్చిన దుస్తులు వారు వేసుకుంటారు. ఒక్కోసారి వృత్తిపరంగానూ విభిన్న దుస్తులు ధరించాల్సి ఉంటుంది. సోషల్‌ మీడియా అనవసరమైన విషయాల్ని హైలెట్‌ చేస్తోంది. అదే మీడియా..

ఆ సీనియర్‌ నటుడు మద్యం సేవిస్తారని కానీ, చిరిగిన బట్టలు తొడుక్కుంటారని కానీ, ఆన్‌స్క్రీన్‌పై మహిళల్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తారనికానీ చెప్పకపోవడం ఆశ్చర్యపడాల్సిన విషయం! పెళ్లై పిల్లలున్న స్టార్‌హీరోలంతా హీరోయిన్లతో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్ చేస్తుంటే దాని గురించి ఎవరూ ప్రశ్నించరెందుకు? చొక్కా లేకుండా తమ శరీరాన్ని చూపిస్తుంటే నోరు మెదపరెందుకు?’ అని ఘూటుగా సమాధానమిచ్చారు.

ట్వీట్టర్ వేదికగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావుపై అనసూయ పరోక్షంగా స్పందించింది. తన వేషధారణ గురించి కొందరూ కామెంట్ చేస్తున్నారని, సినిమాల్లో ఇంతకన్నా దారుణంగా ఉన్న వారి వస్త్రధారణ గురించి మాట్లాడకుండా తననే టార్గెట్ చేయడమేంటని ప్రశ్నించారు. ఎంతో అనుభవమున్న వ్యక్తి ఇలా నీచంగా తనను కించపరుస్తూ మాట్లాడటం సబబు కాదన్నారు. అంతటి అనుభవమున్న వ్యక్తి మహిళలను కించపరుస్తూ, తాగుతూ నటించిన సోషల్ మీడియా, ప్రజలు పట్టించుకోకపోవటం దారుణమని ట్విట్టర్ వేదికగా ఆగ్రహాం వ్యక్తం చేస్తూ షాకింగ్ కామెంట్లు చేసింది

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More