TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Entertainment » నందమూరి నటరత్న బాలకృష్ణ విశ్వరూపం – ‘ఆహా’ అనిపించే ‘అన్ స్టాపబుల్’!!.

నందమూరి నటరత్న బాలకృష్ణ విశ్వరూపం – ‘ఆహా’ అనిపించే ‘అన్ స్టాపబుల్’!!.

by Murthy

ఇప్పటి వరకు హీరోగా, రాజకీయ నాయకుడిగా నటసింహం నందమూరి బాలకృష్ణని   చూశాం. ఇప్పుడు ఆయన  తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు  ఆహా ఓటీటీ కోసం హోస్ట్ గా  ‘అన్ స్టాపబుల్’   సరికొత్త కార్యక్రమానికి అంకురార్పణ  చేసారు.  నవంబర్ 4 (ఈరోజు)  దీపావళి సందర్భంగా ఈ సరికొత్త విభిన్న తరహా కార్యక్రమానికి నాందిగా ప్రసారం చేసారు.  ”ఇంట్రో” దద్దరిల్లిందనడంలో అతిశయోక్తి లేదు. సరికొత్త గెటప్పుతో  శాలువ కుడిభుజమ్మీద వేసుకుని హోస్ట్ గా అలరించారు.  అలాగే వచ్చే అతిధిని ఆహ్వానించే తీరుగానీ, సమయస్ఫూర్తిని ప్రదర్శించి నందమూరి అభిమానులనే కాదు – ఆహాలో  అన్ స్టాపబుల్ చూసే ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకున్నారనే చెప్పాలి. 

బాలయ్య – మోహన్ బాబు ఇద్దరూ చమత్కారాలతో మొదటి ఎపిసోడ్ ని ఆద్యంతం ఆసక్తిగా చూసేలా చేసేసారు. తండ్రిని స్మరించుకుంటూ., తనదైన శైలిలో అభిమానుల హృదయాల్లో దూసుకుపోయే వ్యాఖ్యానంతో తొలి మాటల్లోనే వ్యక్తిత్వాన్ని అందరికి విశిదపరిచేసారు. ప్రశ్నలను ఎంచుకోవడంలోనూ, వాటిని ఎదుటివారి మీద సంధించి వారి దగ్గరనుంచి సమాధానాలు ‘రాబట్టడంలోనూ బాలకృష్ణ ఏ మాత్రం రాజీపడలేదు. అలాగే మోహన్ బాబు కూడా బాలయ్యతో సరదాగా మాట్లాడటం ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించింది.

ఇంకా అతిధి మోహన్ బాబుతో మాత్రమే కాకుండా మంచు విష్ణు, లక్ష్మీప్రసన్నలతో కూడా లైవ్ లో మాట్లాడించడం వారి దగ్గర్నుంచి ఇప్పటిదాకా రివీల్ కాని రహస్యాలను చెప్పించడం., ఆ తర్వాత వాళ్ళిద్దరినీ స్టూడియోలోకి పిలుచుకురావడం – అన్ స్టాపబుల్ కార్యక్రమంలో సంథింగ్ డిఫరెంట్. రాజకీయ జీవితంలోనూ, సినీరంగంలోనూ ఒడిదొడుకులను బాలయ్య – మోహన్ బాబు ఇద్దరూ ఈ ఎపిసోడ్ లో ముఖస్తంగా వివరించడం ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి.

”ప్రతి మనిషి జీవితంలోను ఒక ప్రయాణం ఉంటుంది .. ఆ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే ‘అన్ స్టాపబుల్’. ఈ కాన్సెప్ట్ నాకు నచ్చింది .. అందుకే చేయడానికి ఒప్పుకున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చే నటీనటులతో మాట్లాడతాను .. వాళ్ల భావోద్వేగాలను పంచుకుంటా”నని బాలకృష్ణ చెప్పడం తెలిసిందే.  అదే సమయంలో    అల్లు అరవింద్ మాట్లాడుతూ .. “బాలకృష్ణ గారితో ఒక షో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో నుంచే ఈ కాన్సెప్ట్ పుట్టింది. తెలుగు సినిమా గౌరవాన్ని కాపాడుతూనే ‘ఆహా’ ఎదుగుతుంది” అంటూ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్లే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంది.

కొసమెరుపు ఏంటంటే – అన్నపూర్ణ స్టూడియోలో బాలయ్యతో ఫొటోషూట్ కూడా చేశారు. షూట్ టైంలో ఆయన కాలికి గాయమైనా ఆపకుండా ఫొటోషూట్ కంటిన్యూ చేయడం బాలయ్య  వృత్తిలోని అంకితభావానికి  నిదర్శనం. ఈ ఎపిసోడ్ చూసాక రాబోయే రోజుల్లో సెలబ్రెటీలతో బాలయ్య మరింత రచ్చ రచ్చ చేస్తారనే నమ్మకం కలగడం ఖాయం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కార్యక్రమం – అన్ స్టాపబుల్

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More