మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. సైరా నరసింహారెడ్డి తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవికి జోడిగా కాజల్ నటించగా, మరో జంటగా చరణ్ – పూజ హెగ్డే అలరించనున్నారు. ఫ్యాన్స్‌కి దివాళి ట్రీట్‌గా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగల్‌ని విడుదల చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా దీపావళికి రెండో గీతం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ‘ఆచార్య’ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘లాహే లాహే’ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. డాన్స్‌లో గ్రేస్ ఏ మాత్రం తగ్గకుండా చిరు స్టెప్స్ ఈ పాటలో ఉన్నాయి. దీంతో ప్రతేక్యంగా చిరు అభిమానులకు ఈ పాట విపరీతంగా నచ్చిందని చెప్పాలి.
ఆచార్య చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌గా చరణ్ – పూజ హెగ్డే లపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ గీతాన్ని ఈ నెల 5వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. ‘ఆచార్య’ సినిమాలో చరణ్, పూజాల మధ్య ‘నీలాంబరి’ గీతాన్ని నవంబర్ 5న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా, ఇందుకు సంబంధించిన ప్రోమోను దీపావళి కానుకగా గురువారం విడుదల చేశారు. ఈ సినిమాలో చరణ్ సిద్ధ అనే నక్సలైట్‌గా దర్శనమివ్వనున్నారు. ఆయన ప్రేయసి నీలాంబరిగా పూజా కనిపించనుంది. ధర్మస్థలి కేంద్రంగా ఓ కామ్రేడ్ చేసిన పోరు నేపథ్యంలో సాగే కథ ఇది. కొరటాల శైలిలో సాగే సామాజిక అంశాలతో నిండి ఉంటుంది.