Home » Entertainment » ఓవర్నైట్ లో స్టార్ హీరోయిన్లుగా మారిన టాప్ టాలీవుడ్ ముద్దుగుమ్మలు

ఓవర్నైట్ లో స్టార్ హీరోయిన్లుగా మారిన టాప్ టాలీవుడ్ ముద్దుగుమ్మలు

by Bellamkonda

హైదరాబాద్: సినిమా లలో  నటించే ప్రతి హీరో / హీరోయిన్స్ సినీ పరిశ్రమలో స్టార్డమ్ మరియు వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావాలని కళలు కంటారు. కాని ఫిలిం ఇండస్ట్రీ లో  కొన్ని సంవత్సరాల శ్రమ తర్వాత కూడా కొంత మంది మాత్రమే వాళ్ళ కళలు నిజం చేసుకోగలుగుతారు. మిగిలిన వాళ్లు తమకంటూ ఫాన్స్  స్టార్డామ్ కావాలని కేవలం పగటి కళలు కంటూనే మిగిలిపోతారు. ఇందుకు పూర్తి బిన్నంగా కొంతమంది సెలబ్రిటీస్ కేవలం తమకు వచ్చిన ఒక్క అవకాశం తోనే తమ యాక్టింగ్ స్కిల్స్  ని నిరూపించుకొని  ఓవర్నైట్  స్టార్ లు గా మారిపోతారు. అలా ఓవర్నైట్ లో స్టార్ హీరోయిన్లుగా మారిన టాప్ టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

1) కాజల్ అగర్వాల్  
 
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ మెగాస్టార్ కొడుకు రామ్‌చరణ్ పక్కన హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా “మగధీర” తో ఒక్కసారిగా  ఓవర్నైట్ స్టార్ గా మారింది. రాజమౌళి మాస్టర్ పీస్ ఆల్ టైం సూపర్ హిట్ మగధీర భారీ విజయంతో కాజల్ టాలీవుడ్ లో అగ్ర కథానాయికలలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది.
 


టాలీవుడ్, బాలీవుడ్ మరియు  ఇతర సినీ పరిశ్రమలలో కనీసం 52 సినిమాల్లో నటించిన కాజల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో కాజల్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రంలో నటించిన తరువాత కాజల్ విమర్శకుల ప్రశంసలు సైతం సొంతం చేసుకొంది .

ఈ సినిమాలో నటించకముందు కాజల్ అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొద్దిమందికి తెలుసు, కానీ ఈ చిత్రంలో నటించిన తర్వాత ఆమె తన అద్భుతమైన నటనతో అందరినీ మంత్రముగ్దులను చేసింది.

మగధీర సినిమా తన పాత్రకు ఆమె తెలుగులో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డుకు ఎంపికైంది. ఆ తర్వాత బిజినెస్‌మ్యాన్, బాద్‌షా, గోవిందుడు అండరివాడేలే, మిస్టర్ పర్ఫెక్ట్, బృందావనం మరియు అనేక ఇతర సినిమాల్లో నటించారు.

2) సమంత  

అక్కినేని వారి కోడలు పెళ్ళికిముందు తన భర్త అక్కినేని నాగ చైతన్య తో కలిసి నటించిన మొదటి సినిమా   ‘ఏ మాయ చేసావె’. ఈ సినిమా తో నటిగా టాలీవుడ్ లో తన కెరీర్ స్టార్ట్ చేసింది సమంత, సామ్ చై సూపర్ జోడి మరియు వాళ్ల కెమిస్ట్రీ, వండర్ఫుల్ స్టోరీ తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా  నిలిచింది , నటిగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలోని తన మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 ఏ మాయ చేసావె భారీ విజయంతో సమంత  ఇన్స్టంట్ స్టార్ గా మారింది.  తరువాత ఈగా, రంగస్థలం, ఓ బేబీ మరియు యు-టర్న్ వంటి పలు హిట్ సినిమాల్లో నటించింది.  ఏ మాయ చేసావే  సినిమాలో తన నటనకు సమంతా ఫిల్మ్‌ఫేర్ అవార్డు తెలుగులో ఉత్తమ నటి  కేటగిరి లో ఎంపికైంది.

3) రాశి  ఖన్నా
రాశి  ఖన్నా ఊహలు గుసగుసలాడే లాడే సినిమా తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది. ఇండస్ట్రీ లో మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ , స్మైల్ తో అందరిని ఆకట్టుకుంది.  ఈ సినిమా సూపర్ హిట్ కావడం తో ఫిలిం ఇండస్ట్రీ లో రాశి  ఖన్నా ఓవర్నైట్ స్టార్ గా మారి పోయింది. కేవలం మొదటి సినిమాతోనే  స్టార్ సెలబ్రిటీ హోదాను సంపాదించి రాశి  సంచలనం సృష్టించింది.

రాశి  ఖన్నా జూనియర్ ఎన్టీఆర్ తో హీరోయిన్ గా జై లవ కుశ లో, హైపర్, తోలి ప్రేమా,  శ్రీనివాస కళ్యాణం, వెంకీ మామా చిత్రాల్లో నటించింది.  ఊహలు గుసగుసలాడే  తన నటనకు సైమా అవార్డు లో తెలుగులో ఉత్తమ నటిగా కేటగిరీ లో ఎంపికైంది.

4)  నిత్యా మీనన్

నందినీ రెడ్డి దర్శకత్వంలో అలా మొదలైంది సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయిన మరో ముద్దుగుమ్మ నిత్యా మీనన్. నిత్యా మీనన్ నటిగా మొదటి సినిమాతో తెలుగు ప్రక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఈ సినిమా భారీ విజయంతో నిత్యా మీనన్ ఓవర్నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

 
 అలా మొదలైంది చిత్రంలో తన నటనకు నిత్యా మీనన్ తెలుగులో ఉత్తమ నటిగా నంది అవార్డుకు ఎంపికైంది. నిత్యా మీనన్ గుండెజారి గల్లంతయ్యిందే , ఇష్క్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఆ !, జనతా గ్యారేజ్ మరియు S /o  సన్నాఫ్ సత్యమూర్తి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

 
5) నివేదా థామస్

నివేదా థామస్ కూడా తన తెలుగు లో మొదటి చిత్రమైన జెంటిల్‌మన్‌ తో నేచురల్ స్టార్ నాని పక్కన హీరోయిన్ గా నటించి విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది మరియు తన యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది.

 జెంటిల్మాన్ చిత్రంలో తన నటనకు నివేదా  తెలుగులో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. ఆమె నిన్ను కోరి, జై లవ కుశ, బ్రోచేవారెవరురా వంటి ప్రముఖ తెలుగు సినిమాల్లో నటించింది. అంతేకాకుండా ఇప్పుడు OTT ప్లాట్ఫారం ద్వారా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న  “వి” సినిమాలో నటించింది. అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో కూడా ఈమె లీడ్ రోల్ లో నటిస్తున్నారు.

Also Read: Top 5 Tollywood Actress Who Became Stars Overnight

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

You cannot copy content of this page