TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Devotional » శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇవాళ చక్రస్నానం…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇవాళ చక్రస్నానం…

by Murthy

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు శ్రీమలయప్పస్వామి దేవరులతో కలిసి సర్వభూపాల వాహనంపై కొలువుదీరిన శ్రీవారికి… ఇవాళ చక్రస్నానం నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల శ్రీవారి బ్రహోత్సవాల్లో చక్రస్నానం కీలక ఘట్టం. రాత్రి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయికరోనా కారణంగా బ్రహోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాల్సి వచ్చినా, శాస్త్రబద్ధంగా ఘనంగా జరిపించామని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. స్వామివారికి ఉదయం 8గంటల నుంచి ఐనా మహల్ దగ్గర స్నపన తిరుమంజనం నిర్వహించారు. తర్వాత చక్రస్నానం ఉంటుంది. రాత్రి 7గంటలకు ఆలయంలో బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8నుంచి 9గంటల వరకు నిర్వహించే ధ్వజావరోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టీస్‌ ఎన్వీ రమణ… గురువారం రాత్రి శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో కలిసి ఇవాళ చక్రస్నానం మహోత్సవంలో పాల్గొన్నారురెండు రోజుల పర్యటన కోసం గురువారం రోజు తిరుపతికి వచ్చిన ఆయన.. తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని మొదట దర్శించుకున్నారు.. ఆ తర్వాత తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహం వద్ద సీజేఐ ఎన్వీ రమణకు ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.. ఇక, ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. చ‌క్రస్నానం ఘ‌ట్టంలో పాల్గొన్న ఆయన మూల విరాట్ అభిషేకం అనంత‌రం వీఐపీ విరామ స‌మ‌యంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు.. ఆ తర్వాత రంగ‌నాయ‌కుల మండ‌పంలో సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు వేద పండితులు వేద ఆశీర్వచ‌నం ప‌లికి శేష‌వ‌స్త్రంతో స‌త్కరించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్ర ప‌టం, 2022 క్యాలెండ‌ర్‌, టీటీడీ త‌యారుచేసిన అగ‌ర‌బ‌త్తుల‌ను అందజేశారు. 

ఎస్వీబీసీ, ఇరత ఛానల్స్‌ ద్వారా దేశ వ్యాప్తంగా భక్తులు బ్రహ్మోత్సవాలను తలకించారన్నారు. ఆన్‌ లైన్‌లోనే కాకుండా తిరుపతి కాలినడక మార్గంలో టికెట్ల కేటాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More