హైదరాబాద్: రేపటి ఆదివారం అనగా సెప్టెంబర్ 13, 2020 నాడు నవగ్రహాలలో ఆరు గ్రహాలు ఎన్నడూ జరగని విధంగా వాటి ప్రభావం ఉండబోతుంది. ప్రతి 200 సంవత్సరాలకు జరిగే అద్భుతం రేపు జరగబోతుంది. అలాంటి రోజున భక్తి శ్రద్దలతో పూజ ఆచరిస్తే వందరెట్లు ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు.
నవగ్రహాలలో మార్పు ఎంతో విశేషమైనదని, ఎన్నో ధర్మ కోరికలను నిరవేరుస్తుంది అని మహాపండితుల దగ్గర నుంచి జ్యోతిష్యుల వరకు చెప్తున్నారు. అసలు ఆదివారం రోజు జరిగే అద్భుతం ఏమిటి?

సంక్రాంతి మొదలుకొని ప్రతి నెల సూర్యాది నవగ్రహాలు పన్నెండు రాశులలో ఏదో ఒక రాశిలోకి ప్రవేశిస్తాయి. దీనినే సంక్రమణం అంటారు. అయితే రేపటి రోజున నవగ్రహాలలో ముఖ్యంగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శని వాటి స్వక్షేత్రంలో అనగా వారు జన్మించిన రాశిలోకి (respective zodiac sign) ప్రవేశిస్తున్నారు.
సూర్యుడు సింహరాశిలో, చంద్రుడు కర్కాటకంలో, కుజుడు మేష రాశిలో, బుధుడు కన్యరాశిలో, గురువు ధనుస్సులో, శని మకర రాశిలో ప్రవేశిస్తున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం అనుసరించి పరిశీలన చేస్తే తేలిన విషయం ఏమిటి అంటే ఈ విధంగా కేవలం 200 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఇక రాబోయే 200 సంవత్సరాల వరకు ఇటువంటి అవకాశం లేదని శాస్త్రం తెలుపుతుంది.

కావున సెప్టెంబర్ 13న (భాద్రపద బహుళ ఏకాదశి రోజు, పునర్వసు నక్షత్రం) ఎవరైతే ధర్మమైన కోరిక కోరి 11:36 ని|| నుండి 11:51 మధ్యలో పూజ లేదా జపం లేదా ధ్యానం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి రోజు చేసే దానికన్నా వంద రెట్లు ఎక్కువ ఫలితం పొందుతారని శాస్త్రం ఘోషిస్తుంది. ఈ యొక్క గ్రహసంచారం రేపు మాత్రమే కాక 14 మరియు 15 తారీఖులలో కూడా ఉంటుంది.
తేదీ | తిథి | యోగ సమయం | |
మొదటి యోగం | 13 సెప్టెంబర్, 2020 | ఆదివారం భాద్రపద బహుళ ఏకాదశి పునర్వసు నక్షత్రం | 11:36 నుండి 11: 51 వరకు |
రెండవ యోగం | 14 సెప్టెంబర్, 2020 | సోమవారం భాద్రపద బహుళ ద్వాదశి పుష్యమి నక్షత్రం | 11:32 నుండి 11:47 వరకు |
మూడవ యోగం | 15 సెప్టెంబర్, 2020 | మంగళవారం భాద్రపద బహుళ త్రయోదశి ఆశ్లేష నక్షత్రం | 11:28 నుండి 11:43 వరకు |
ఈ సమయంలో దైవ నామం, దైవారాధన అధిక శక్తిని, ఫలాన్ని ఇస్తాయి. తమ తమ నమ్మకాలను అనుసరించి ఆచరించి అందరూ దేవుని అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుతున్నాము.