TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Devotional » దినఫలలూ ఆగష్టు 31| ఈ రోజు రాశి ఫలాలు ఆగష్టు 31| Horoscope August 31 And Remedies

దినఫలలూ ఆగష్టు 31| ఈ రోజు రాశి ఫలాలు ఆగష్టు 31| Horoscope August 31 And Remedies

by Bellamkonda

మేష రాశి

మేష రాశి వారికి సోదరులతో వివాదాలు ఏర్పడతాయి, శ్రమ ఆధిక్యత కలుగుతుంది.  ఆలోచన విధానాలు స్థిరంగా ఉండకపోవచ్చు. కుటుంబాల్లో ఒత్తిడి పెరుగుతుంది, ఉద్యోగాల్లో ఇబ్బందులు కలగవచ్చు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ రోజు వీరు శ్రీ రాజా మాతంగే నమః అనే నామాన్ని జపిస్తే మంచిది. 

రాశి

వృషభ రాశి

వృషభ రాశి వారు ఈ రోజు చేపట్టిన పనులలో మిత్రులు సహకరిస్తారు. వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. ఆశ్చర్య కరమైనటువంటి సంఘటనలు తెలుస్తూ ఉంటాయి, సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం  వీరు దక్షిణ మూర్తి స్తోత్రం పారాయణం చేసుకోవడం ఉత్తమం.

రాశి

మిథున రాశి

మిథున రాశివారు ఈ రోజు విశేషమైన కుటుంబ పరమైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో అనుకున్న పనులు నెరవేరుతాయి. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి కీలకమైన సమాచారాలు అందుతాయి. ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం శ్రీలలితసహస్రనామ  స్తోత్రం  పారాయణం చేయడం మంచిది.

రాశి

కర్కాటక రాశి 

కర్కాటక రాశి వారు ఈ రోజు ఋణప్రయత్నాలు కలిసివస్తాయి. కుటుంభ పరమైన ఒత్తిడిలు పెరుగుతూ ఉంటాయి, ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మొదలు పెట్టిన పనులను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరుత్సహ పరుస్తాయి. ఈ రోజు వీళ్లు  నవాగ్రహ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది. 

రాశి

సింహ రాశి

ఈ రోజు  సింహ రాశి వారు కష్టమైన పనులు చేపట్టాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో వివాదాలు చోటుచేసుకుంటాయి.  చేపట్టిన పనులు వాయిదా పడుతూ ఉంటాయి.ఉద్యోగ విషయాల్లో తొందరపడి వ్యవహరించడం మంచిది కాదు.  ఈ రోజు  వీరు గురుగ్రహ అర్చన  చేస్తే మంచిది.

రాశి

కన్యా  రాశి  

ఈ రోజు కన్యా రాశి వారికి పరిచయాలు పెరుగుతాయి. సామాజిక గౌరవాలు పెంచుకునే విషయంలో అలోచించి నిర్యాలు తీసుకోవాలి. నూతన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భూ సంబంధిత వాహన సంబంధమైన లాభాలు కలిసి వస్తాయి. ఈ రోజు శుభఫలితాలు కోసం కార్తవేరి ఆర్జన నామస్మరణం చేయడం మంచిది.

రాశి

తులా రాశి

తులా రాశి వారికి ముఖ్యమైన పనులు వాయిదా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఇబ్బందులు ఎదురైనా మీరు అనుకున్నది సాధిస్తారు. మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు.
ఈ రోజు శుభఫలితాలు కోసం అష్టలక్ష్మి స్తోత్రం పఠిస్తే మంచిది.

రాశి

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు పనుల్లో ఉన్న ఆటంకాలను అధిగమించగలుగుతారు. ఒత్తిడి అధిగమిస్తారు. మాట పట్టింపులు పెరుగుతుంటాయి బాకీలు వసూలు చేస్తారు. వృత్తి యాపారాల్లో అనుకూలత పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు వృశ్చిక రాశి వారు విష్ణుసహస్ర నామం పారాయణం చేసుకొని, తెలిసి కోట దగ్గర దీపారాధన చేస్కోవడం మంచిది.

రాశి

ధనస్సు రాశి

ఈ రోజు ధనస్సు రాశి వారికి చేపట్టిన పనులు సాఫీగా ముందుకు సాగిపోతూ ఉంటాయి, శుభకార్యాక్రమాల కోసం దాచుకున్న ధనాన్ని ఉపయోగిస్తారు. ఇంట బయట తీర్చలేని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మిక దైవ చింతనలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రోజు వీరు పార్వతి అమ్మవారికి అర్చన చేస్తే మంచిది.

రాశి

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు కొత్తమిత్రులతో పరిచయాలు ఏర్పడుతాయి. సమస్యలు తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగాలల్లో దనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. కుటుంబ సమస్యల నుంచి వీరు ఈ రోజు బయటపడతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. ఈ రోజు మకర  రాశి వారు ఈరోజు శనీశ్వర ఆరాధన తైలాభిషేకం చేస్తే మంచిది.  

రాశి

కుంభ రాశి

ఈ రోజు కుంభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు పెరిగి అప్పులు చేయవలిసి వస్తుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, వ్యాపార విస్తార వాయిదా వేస్తారు.  విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని అందుకుంటారు. ఈ రోజు వీళ్లు  లక్ష్మి గణపతి అర్చన నిర్వహిస్తే  మంచిది. 

రాశి

మీన రాశి

మీన రాశి వారికీ ఈ రోజు సన్నిహుతుల నుండి సుహానాలు సలహాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు విజయంవంతం అవతూ ఉంటాయి. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభిస్తారు. సామజిక పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు వీళ్లు శివారాధన చేస్కోవడం బిల్వలు శివుడికి అర్పించడం మంచిది.

రాశి

Related Articles

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More