మేష రాశి
అనుకున్న విధంగా చేపట్టిన పనులన్నీ పూర్తీ చేసుకుంటారు, వీరికి ఈ రోజు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు. వ్యతిగత ఆలోచనల్లో కొన్ని మార్పులు అవసరం అవుతుటాయి. మేష రాశి ఈ రోజు విలువైన వస్తువులు ఆభరణాలు సమకూర్చుకుంటారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వివాహయత్నాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ధనధాన్య లాభాలుంటాయి ఉంటడేఅవకాశం ఉంది. ఈ రోజు వీళ్లు కార్తికేయ స్వామిని పూజిస్తే మంచి జరుగుతుంది.

వృషభ రాశి
వృషభ రాశి వారు ఈ రోజు చేపట్టిన పనులన్నీ జాగ్రత్తగా నిధానంగా పూర్తి చేసుకుంటారు. కలిస్ వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యల నుంచి కుడా బయట పడతారు. వృషభ రాశి వారు ఈ రోజు మంచి ఆహ్వానాలు అందుతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు. పెద్దల సలహాలు అందుతూ ఉంటాయి. వీళ్లు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన కార్యక్రమాలకు మొదలు పెడతారు. ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం వీరు చదువు చెప్పిన గురువు ఆశీర్వాదం తీసుకోవడం ఉత్తమం.

మిథున రాశి
మిథున రాశివారు ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు నిధానంగా పూర్తీ చేస్తారు మరియు శ్రమ పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత ప్రయోజనాలకోసం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ముఖ్య నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో మాట పట్టింపులు పెరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు శుభా ఫలితాలు పొందడం కోసం గణపతి విష్ణుసహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం మంచిది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికీ నూతన ఉద్యోగ అవకాశలు కలిసి వస్తుంటాయి. ముఖ్యమైన నింయాలు తీసుకుంటారు, బాకీలు వసూలు చేసుకుంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, కళాకారులను అనుకూలమైనటు వంటి సమయం. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఈ రోజు వీళ్లు చంద్రగ్రహ అర్చన చేస్తే మంచిది.

సింహ రాశి
ఈ రోజు సింహ రాశి వారు కొత్త ఉత్సాహంతో చేపట్టిన పనులు పూర్తీ చేసుకుంటారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిషారం అవుతాయి . ఆరోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దూరప్రాంతం లో ఉన్న స్నేహితులను కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. విందు వినోధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనేప్పుడు అలోచించి కొనుగోలు చేస్తే మంచిది. ఈ రోజు వీరు శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేస్తే మంచిది.

కన్యా రాశి
ఈ రోజు కన్యా రాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. అనారోగ్య భావనను విల్లు తొలగించుకోవాలి, దీర్ఘకాలిక సమస్యలు చికాకు పుట్టిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. కొద్దిపాటి వివాదాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అనంతమైన లాభాలు పొందే ప్రయత్నం చేస్తుంటారు. ఈ రోజు శుభఫలితాలు కోసం అనంతపద్మనాభస్వామి దర్శనం చేసుకోవడం మంచిది.

తులా రాశి
తులా రాశి వారికి చేపట్టిన పనులు వాయిదా పడుతూ ఉంటాయి. మిత్రులతో విభేదాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార, ఉద్యోగ విషయాల్లో లేనిపోని సమస్యలు ఘర్షణలు పెరుగుతూ ఉంటాయి. పై అధికారుల యొక్క అనుకూలతను పొందే ప్రయత్నం చేస్తే మంచిది. ఈ రోజు శుభఫలితాలు కోసం”శ్రీ రాజమాతంగే నమః ” అనే నామాన్ని జెపం చేయడం మంచిది.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు అవుతూ ఉంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంఘం లో మీకు కొన్ని రకాల గౌరవాలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు ,ఆభరణాలు సేకరించుకుంటారు. సమస్యల నుండి బయటపడతారు. ఈ రోజు వృశ్చిక రాశి వారు గణపతి అష్టోత్తర శతనామ స్తోత్రం చేస్కోవడం మంచిది.

ధనస్సు రాశి
ఈ రోజు ధనస్సు రాశి వారికి చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి, ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ విషయాల్లో సంతృప్తి కరమైన ఫలితాలు ఉంటాయి. ఆలోచన విధానాల్లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఈ రోజు వీళ్లు గణపతి స్తోత్రం పారాయణం చేస్తే మంచిది.

మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు నష్టపరంగా ఉంటాయి, ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో గొడవలు వస్తాయి. ఆలయాలు ఆశ్రమాలు సందర్శితుంటారు. ఉద్యోగ విషయాల్లో కొన్ని రకాల సమస్యలనుని బయటపడే ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు మకర రాశి దుర్గ సప్తశ్లోకి మంత్రం పారాయణం చేసుకుంటే మంచిది.

కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశి వారికీ కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది, కొన్ని పనులు వాయిదా వెయ్యాల్సి వస్తుంది . బద్ధంకం ఉంటుంది, శరీరం అంతగా సహకరించకపోవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనం వాయిదా పడ్తుంది. చేపట్టిన పన్నులో ఏమాత్రం ఆసక్తి లేకపోవడం, గంభీరంగా పనిచేస్తున్నట్టు భవనాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రోజు వీళ్లు శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం మంచిది.

మీన రాశి
మీన రాశి వారికీ ఈ రోజు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోద పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ విషయాల్లో పై అధికారులతో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, జాగ్రతగ్గా వ్యహరించాలు . ఈ రోజు వీళ్లు నవగ్రహాలను నవ ధాన్యాలతో అర్చన చేస్తే మంచిది.
