TheIndiaMedia website is for sale. Those who are interested to purchase can reach out to us at theindiamedia2020@gmail.com
Home » Devotional » యాదాద్రి విమాన గోపురానికి కిలో బంగారం ఇస్తానన్న కడప జిల్లా జెడ్పీటీసీ…జయమ్మ.

యాదాద్రి విమాన గోపురానికి కిలో బంగారం ఇస్తానన్న కడప జిల్లా జెడ్పీటీసీ…జయమ్మ.

by Murthy

తెలంగాణలో యాదాద్రి ఆలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. యాదాద్రి మ‌హా కుంభ సంప్రోక్ష‌ణ‌కు ముహూర్తం ఖ‌రారైంది. వచ్చే ఏడాది 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మహా సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శన యాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఆల‌య గ‌ర్భగుడిపై ఉండే విమాన గోపురానికి అద్భుత‌మైన స్వ‌ర్ణ తాప‌డం చేయించాల‌ని నిర్ణ‌యించి న‌ట్లు తెలిపారు. ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు.

స్వ‌ర్ణ తాప‌డం కోసం త‌మ కుటుంబం తరఫున ఒక‌ కిలో 16 తులాలు బంగారం ఇవ్వ‌నున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ నిధుల కూర్పు త‌ర్వాత బంగారం కొనుగోలు చేస్తామ‌ని చెప్పారు. అయితే మేలైన బంగారం కావాల‌ని కాబ‌ట్టి రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచే మొత్తం బంగారాన్ని కొనుగోలు చేస్తామ‌ని తెలిపారు. ఆ త‌ర్వాత తిరుమ‌ల త‌ర‌హాలో స్వ‌ర్ణ‌ తాప‌డాన్ని పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇప్పటికే చాలమంది కిలో బంగారాన్ని తమ తరఫునుంచి ఇస్తామని ప్రకటించారు. కొన్ని సంస్థలు కూడా తన సంసిద్ధతని తెలియజేసాయి.

ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన ఓ జెడ్పిటిసి కిలో బంగారాన్ని యాదాద్రి కోసం విరాళంగా ఇచ్చింది. కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త చిన్నమండెం జెడ్పీటీసీ జయమ్మ కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తాను తన కుటుంబ సభ్యులు కలిసి కిలో బంగారాన్ని ఆలయానికి ఇస్తున్నట్టు జయమ్మ ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో అందిస్తామన్నారు. 

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More