Home » Devotional » వినాయక చవితి 2020: పూజ సమయం, కావాల్సిన పదార్ధాలు , చేయకూడని పనులు

వినాయక చవితి 2020: పూజ సమయం, కావాల్సిన పదార్ధాలు , చేయకూడని పనులు

by Bellamkonda

మనం ఈ పని ప్రారంబించాలన్న పూజించే దైవం వినాయకుడు, అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన వినయ చవితి రోజు పాటించవలసిన నియమాలు, కావలసిన పూజ సామాగ్రి, పాటించవలసిన మంత్రాలూ నైవేద్యాలు ఏంటో మీకు తెలుసా? వినాయక చవితి రోజు ఆ గణనాధుని పూర్తి అనుగ్రహం లభించాలంటే ఆగస్టు 22 శనివారం 2020 వినాయక చవితి రోజు ఈ విధం పూజ చెయ్యండి.

కావాల్సిన పదార్దాలు :
పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, తమలపాకులు, కర్పూరం, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, 21 రకాల పత్రి, ఉద్దరిణ, వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలు.

పూజ రోజు పాటించవలసిన నియమాలు :
గుమ్మానికి మామిడాకులు కట్టాలి
కడపను పూజించాలి
తల స్నానం చేసుకోవాలి
సాంప్రదాయమైన వస్త్రాలు ధరించాలి
కుంకుమ గంధం బొట్టుగా ధరించాలి
స్త్రీలు తలలో పువ్వులు పెట్టుకోవాలి, కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి

పూజా సమయం
ఆగస్టు 22 న ఉదయం 11.06 నుంచి మధ్యాహ్నం 01.42 మధ్య మధ్యనా గణేశ పూజ ముహూరత్ ఉంది. ఆ రోజు రాత్రి 07.57 గంటల వరకు గణేశ్ చతుర్థి తిథి ఉంటుంది
కానీ ఆగస్టు 22 మధ్యాహ్నం 12.22 నుంచి సాయంత్రం 04.48 వరకు అమృత గడియలు ఉన్నాయి.

చేయకూడని పనులు :
గణేశుడిని ఆరాధించేటప్పుడు, మనం నీలం మరియు నలుపు దుస్తులను పొరపాటున ధరించకూడదు. గణేశుడు ఇలా చేయడం ద్వారా కోపం వస్తుంది.
ఆరాధనలో గణేశుడికి ఎప్పుడూ తులసి ఆకులు పెట్టకూడదు.
ఈ రోజు పొరపాటున కుడా చందమామను దర్శించకూడదు
పూజ చేయకుండా, కథ వినకుండా బయటకి వెల్లకూడదు

నైవేద్యాలు:
ఎక్కువగా ఉడకబెట్టిన నైవేద్యాలు పెట్టాలి
లడ్డులు
కుడుములు
పానకం
పులిహోర
చక్కర పొంగలి
దద్దోజనం

Related Articles

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

You cannot copy content of this page