ఇండియ‌న్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తోన్న నెటిజ‌న్లు!..

సోషల్ మీడియాలో యూజర్లు టీమ్ ఇండియా ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా.. ముఖ్యంగా విరాట్ కోహ్లీని టార్గెట్ చేశారు. విరాట్ కోహ్లీ పాత ట్వీట్‌ని, పదేళ్ల తర్వాత బయటకు తీసుకుని వచ్చి మరీ ట్రోల్ చేస్తున్నారు. 23 జనవరి 2011న చేసిన ట్వీట్‌ని పదేళ్ల తర్వాత ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు.  ఇండియ‌న్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని నెటిజ‌న్లు టార్గెట్ చేస్తున్నారు.

అప్పట్లో సౌతాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన తర్వాత కోహ్లీ ఈ ట్వీట్ చేశాడు. 23 జనవరి 2011న, ODI సిరీస్‌లో చివరి మ్యాచ్‌ను 33 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 3-2తో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే ట్వీట్‌ని ట్రోల్ చేస్తూ.. విరాట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ ట్విట్టర్ యూజర్ విరాట్‌ను జోఫ్రా ఆర్చర్‌గా అభివర్ణించారు. ఆర్చర్ గతంలో చేసిన ట్వీట్లు వైరల్ అవుతూ ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు కోహ్లీ ట్వీట్ వైరల్ అవుతుంది.

పాకిస్థాన్ తో ఇలాంటి సిరీస్ ల‌లో ఏనాడు అప‌జ‌యం చూడ‌ని భార‌త్ కు కోహ్లీ నాయ‌క‌త్వం ఓట‌మి పాల‌య్యేలా చేసింది. అది చాల‌ద‌న్న‌ట్లు యాంటీ హిందూ క‌బుర్లు చెప్ప‌డం హార్ట్ కోర్డ్ హిందూస్ కు మండేలా చేసింది. టాప్ ఆర్డ‌ర్ వైఫ‌ల్యం గురించి కోహ్లీ మాట్లాడ‌టంపై మాజీ క్రికెటర్ అజ‌య్ జ‌డేజా కూడా.. కోహ్లీ స్టేట్మెంట్ ను తూర్పార‌బ‌ట్టాడు. ఓ కెప్టెన్ కు ఉండాల్సిన‌ ప్ర‌ధాన ల‌క్ష‌ణం స‌హ‌నం,బ్యాలెన్స్ గా మాట్లాడ‌టం. ఐతే ఇవేవి కోహ్లీకి లేవు.రోహిత్ శ‌ర్మ ఎక్క‌డ త‌న‌కు పోటీ వ‌స్తాడోన‌ని లాబీల‌లో అత‌న్ని తీసిపారేస్తూ మాట్లాడ‌టం కూడా విరాట్ పై బిగ్ కంప్లెయింట్ గా ఉంది.

అయితే ప్రపంచ కప్‌లో భారత్ వరుసగా రెండు పరాజయాల తర్వాత ఆన్‌లైన్ దాడిని ఎదుర్కొంటున్న క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం మద్దతునిచ్చాడు. “ఎవరూ ఇవ్వనందున ద్వేషంతో నిండి ఉన్నందున ట్రోల్ చేస్తున్న వారిని క్షమించాలని కోరారు.

Related posts

TheIndiaMedia Website For Sale.

కోహ్లీ కుమార్తెకు రేప్​ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి అరెస్ట్!..

క్రికెట్ టీం ని తిట్టొద్దు… ”గంభీర” ప్రకటన!..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More