T20 World Cup : ఎన్నో సమస్యల నడుమ టి20 మహా సంగ్రామంలో అడుగు పెట్టిన అఫ్గాన్ అదిరే ప్రదర్శనతో శుభారంభం చేసింది. స్కాట్లాండ్తో జరిగిన సూపర్–12 లీగ్ మ్యాచ్‌లో మొదట మెరుపులు మెరిపించిన ఆ జట్టు… ఆ తర్వాత ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలంతో 130 పరుగుల తేడాతో గెలిచి టి20 ప్రపంచ కప్ ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించింది. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకొని 130 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. షార్జాలో జరిగిన మ్యాచ్‌లో తొలుత అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్ 12 గ్రూప్-2లో భాగంగా స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆఫ్ఘన్ బ్యాట్స్‌మెన్ అద్భుతంగా ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్థాన్‌కు ఓపెనర్లు హజ్రతుల్లా జాజాయ్ మహమ్మద్ షాజాద్ శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు.
ఈ క్రమంలో 15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 22 పరుగులు చేసిన షాజాద్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ జాజాయ్ కూడా పెవిలియన్ చేరాడు. క్రీజులో ఉన్నంత సేపు అతడు మెరుపులు మెరిపించాడు. 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిశాయి. ఆఫ్ఘన్ 2 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. రహమానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్ క్రీజులో ఉన్నారు.
నజీబుల్లా (34 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. రహ్మనుల్లా గుర్బాజ్ , హజ్రతుల్లా, కూడా రాణించడంతో అఫ్గాన్ భారీ స్కోరును సాధించింది. స్కాట్లాండ్ 10.2 ఓవర్లలో 60 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ముజీబ్ ఉర్ రెహమాన్ (5/20) – రషీద్ ఖాన్ (4/9) స్కాట్లాండ్ పని పట్టారు.