బండి సంజయ్ మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేసీఆర్.

మాకేం మ‌నీలాండ‌రింగ్‌లు, బొండ‌రింగ్‌లు లేవు. మాకేం కంపెనీలు లేవు. దందాలు లేవు. మాకేం బిజినెస్‌లు లేవు. దొంగ వ్యాపారాల్లేవు. నాకేం లేవు. మీరు మ‌మ్మ‌ల్ని ఏం చేయ‌లేరు. అది కూడా చెప్తున్నా.. జ్ఞాప‌కం పెట్టుకో. ఏమంటే ఏం చేయ‌లేరు. నిటారుగా ఉన్నాం.. నిఖార్సుగా ఉన్నాం. ఎవ‌రితోనైనా పోరాడుతాం. ఎవ‌రికీ భ‌య‌ప‌డం. ఇంకోమాట కూడా హెచ్చ‌రిస్తున్నా. పిడుగు, పెళ్లికి, చావుకు అదే మంత్రం అంటే న‌డ్వ‌దు. అన‌వ‌స‌ర‌మైన ప్ర‌య‌త్నాలు చేస్తే బూమ‌ర్ హ్యాంగ్ అయిత‌ది. నే ఈ దేశంలో డ‌బ్బులు ఎక్కువ ఖ‌ర్చు పెట్టే పార్టీ బీజేపీనే అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక్కడ పునాది లేనిది మీకు, మాకు కాదు” అంటూ బీజేపీ తెలంగాణ నాయకత్వంపై ధ్వజమెత్తారు.

బండి సంజయ్ కేసీఆర్ ఫామ్ హౌజ్ ను దున్నుతాం అని బండి సంజయ్ కామెంట్లకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఫామ్ హౌజ్ దున్నడానికి బండి సంజయ్ ఏమైనా ట్రాక్టర్ డ్రైవరా.. అని ఎద్దేవా చేశారు. చట్టానికి, భూసంస్కరణలకు అనుగుణంగా బాజాప్తా భూమిని కొనుగోలు చేశామన్నారు. తీవ్ర స్వరంతో బండి సంజయ్ ని హెచ్చిరించారు. ప్రత్యేక తెలంగాణ వస్తే దళితుడ్ని తొలి సీఎం చేస్తామని కేసీఆర్ ప్రకటించడం, దానిపై విపక్షనేతలు ఇప్పటికీ విమర్శిస్తుండడం తెలిసిందే.

తాజా ప్రెస్ మీట్లో సీఎం కేసీఆర్ ఈ అంశంపై స్పందించారు. తాము దళితుడ్ని సీఎం చేస్తామని చెప్పడం, తదనంతర కాలంలో చేయలేకపోవడం వాస్తవమేనని అన్నారు. దళితుడ్ని సీఎం చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలిపారు. తామే దళితుడ్ని సీఎం చేయనివ్వలేదంటూ షబ్బీర్ అలీయే గతంలో చెప్పాడని, ఇప్పటికీ విపక్ష నేతలు ఈ అంశంపై మాట్లాడడం తగదని పేర్కొన్నారు. తెలంగాణకు బీజేపీ, బండి సంజయ్‌ ఏం చేశారో చెప్పాలి. దేశంలో ఏ వర్గం ప్రజలకు, ఏ జాతికి మీరు మేలు చేశారు. మేము లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 70 వేలకు పైగా ఉద్యోగాలు ఇవ్వబోతున్నం’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

Related posts

TheIndiaMedia Website For Sale.

Flipkart Mobile Bonanza Best Mobile Phone Deals on iPhone 12, iPhone 12 Mini, and more

Shanmukh Parents Reveals Details About Shanmukh and Deepthi Sunaina Wedding

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More