కేటీఆర్ న్యాయం చెప్పాలంటూ ప్రముఖ యాంకర్ కమ్ నటి అనసూయ తాజాగా కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. పిల్లలకు టీకాలు లేనందున స్కూల్స్‌కు వెళ్ళే పిల్లల పరిస్థితేంటి?..అని ప్రశ్నించారు. పిల్లలు సూల్లో ఉన్నప్పుడు ఏం జరిగినా తమది బాధ్యత కాందంటూ స్కూల్ యాజమాన్యం సంతకం చేయించుకుందని, క్లాస్ రూమ్ లకు పంపాలంటూ బలవంతం చేస్తున్నారని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇది ఎంతవరకు న్యాయమో చెప్పాలనీ, దీనిపై మార్గనిర్దేశం చేయాలని అనసూయ వరుసగా ట్వీట్లు చేశారు.
ప్రముఖ యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తన అభిమానులకు అప్డేట్స్ ఇవ్వడంతో పాటుగా, సామాజిక అంశాలపై కూడా ఆమె స్పందిస్తూ ఉంటారు. అంతేకాకుండా తనపై నెగిటివ్ కామెంట్స్ చేసేవారికి కూడా అనసూయ తనదైశ శైలిలో ఘాటైన కౌంటర్స్ ఇస్తుంటారు. అయితే ఓ విషయంలో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అనసూయ ట్విట్టర్ వేదికగా ఓ అభ్యర్థన చేసింది. సరైన మార్గనిర్దేశనం చేయాల్సిందిగా కోరారు. పిల్లలకు వ్యాక్సినేషన్ జరగలేదు., కానీ పిల్లల విషయంలో పాఠశాలలు తల్లిదండ్రులను ఎందుకు బలవంతం చేస్తున్నాయని అడిగారు.
అంతేకాకుండా పిల్లలకు ఏదైనా జరిగితే పాఠశాలల యజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదని సంతకాలు తీసుకోవడం ఎంతవరకు సరైనది అని ఆమె ప్రశ్నించారు. ఎప్పటిలాగే ఈ విషయంలో కూడా సరైన మార్గనిర్దేశనం చేస్తారని ఆశిస్తున్నానని.. కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎలా అర్థం చేసుకుంటారు? ఆయన స్పందన ఏంటి? అనేది చూడాల్సి వుంది.