సినిమా ఇండస్ట్రీలో రూమర్లు, గాసిప్స్ ముందు పుట్టి వార్తలు తర్వాత పుడుతాయి. ఇక హీరో, హీరోయిన్ల ఆఫైర్ల విషయంలో హద్దు అదుపు ఉండదు. ఇద్దరు కలిసి రెండు, మూడు చిత్రాల్లో నటించారంటే చాలు.. ఇక వారి మధ్య రిలేషన్, అఫైర్ అంటూ రూమర్లు విస్తృతంగా ప్రచారం అవుతుంటాయి. ఇందుకు మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ అతీతుడేమీ కాదు.తనతో నటించిన హీరోయిన్‌తో పెళ్లి అంటూ ఓ వార్త వెబ్ మీడియాలో హడావిడి చేస్తున్నది. అయితే తాజా వార్తలో పెళ్లి ఫిక్స్ అంటూ ఓ వెబ్సైట్ కథనాన్ని ప్రచురించింది. అందులో వాస్తవం ఎంత ఉందనే విషయంపై సాయిధరమ్ తేజ్ స్పందిస్తే తప్ప అసలు విషయం బయటపడదు. అప్పట్లోనే సమంత, నాగచైతన్య పెళ్లి తర్వాత సడన్‌గా సాయి ధరమ్ తేజ్, రెజీనా పెళ్లి ఫిక్స్ అయిందంటూ వార్తలు మళ్లీ మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఓ ‘కొత్త హీరోయిన్ ‘పేరు వినిపిస్తోంది.
బైక్ యాక్సిడెంట్‌కు గురై హాస్పిటల్లో చికిత్స తీసుకుని ప్రాణా పాయం నుంచి బయట పడిన సంగతి తెలిసిందే. పూర్తి ఆరోగ్యంతో ఈ హీరో ఇంటికి తిరిగొచ్చాడు కూడా. ఈ ఏడాది సాయితేజ్ పెళ్లి జరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇది వరకు సాయిధరమ్ ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడనే వార్తలు కూడా వినిపించాయి. పెళ్ళి కూతురు ఎవరో కాదు…తిక్క హీరోయిన్…అదే ‘తిక్క’ సినిమాలోని హీరోయిన్ ”లారిస్సా బోనెసి”. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించింది. కమర్షియల్ యాడ్స్, ‘గో గోవా గాన్’ వంటి హిందీ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన లారిస్సా బోనెసి – తేజ్ … ప్రేమ వ్యవహారంపై మెగా కాంపౌండ్ గాసిప్స్‌పై స్పందించ;డం ఎందుకని అనుకుందేమో సైలెంట్‌గా ఉండిపోయింది. పరిస్థితులు చూస్తుంటే సాయిధరమ్ తేజ్, లారిస్సా బోనెసి నిజంగానే ప్రేమించుకున్నారా? ఏంటి అనిపిస్తుంది.
అందుకు కారణం.. అది నిజమే అనుకునేటట్లు చేయడం ట్వీట్ రావడం. సాయితేజ్ ‘రిపబ్లిక్’ మూవీ విడుదల సమయంలో నాతేజు నటించిన రిపబ్లిక్ ఈరోజు విడుదలవుతుంది అంటూ ట్వీట్ చేస్తూ లవ్ సింబల్‌ను పోస్ట్ చేసిన లారిస్సా..రీసెంట్గా ‘ఐ మిస్ యు తేజ్’ అంటూ రీసెంట్గా ట్వీట్ చేసింది. రీసెంట్గా ‘ఐ యామ్ ఇన్ లవ్’.. అంటూ మరో ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్స్ ఆమె సాయితేజ్‌తో ప్రేమలో ఉందని అంటున్నారు.
లారిస్సా డజను బ్రాండ్లకు ప్రమోటర్. ప్రఖ్యాత బ్రాండ్లు ఓలే.. లాంకోమ్ .. లోట్టోస్ స్పోర్ట్ వంటి బ్రాండ్ లకు మోడల్ గా భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుని ఆర్జిస్తోంది. ఎలిగాన్స్ ప్రోస్పెరిట్.. కన్వర్స్.. నైన్ వెస్ట్ .. లెవిస్ బ్రాండ్లు ఈ అమ్మడి ఖాతాలో ఉన్నాయి.