”మంచు Vs మెగా” ఇంకా గొడవలు సమసిపోలేదా!?.

మా” ఎన్నికలు ముగిసాయి. అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న మంచు విష్ణు, గెలిచిన కార్యవర్గ సభ్యులు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‎లో పదవి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా రానున్నారు.. అలాగే నందమూరు బాలకృష్ణను సైతం విష్ణు ప్రత్యేకంగా ఆహ్వానించారు.

నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆయనతో అరగంట పాటు మోహన్ బాబు, విష్ణులు చర్చించిన సంగతి తెలిసిందే. అలాగే.. సినీ పెద్దలు పరుచూరి బ్రదర్స్, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం‏ను కలిసి ప్రమాణా స్వీకార మహోత్సవానికి రావాలని విష్ణు కోరారు. అయితే సినిమా పెద్దలను ఆహ్వానించిన విష్ణు.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్‎ చిరంజీవిని ఆహ్వానించనట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కౌంటింగ్ రోజున.. త్వరలో చిరంజీవిని వ్యక్తిగతంగా కలుస్తానని మంచు విష్ణు చెప్పిన సంగతి విదితమే.

ఆనవాయితీ ప్రకారం “మా” అధ్యక్షుడితో పాటుగా కార్యవర్గం ప్రమాణ స్వీకారానిని సిద్దం అవుతోంి. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే ఎన్నికల సమయంలో మొదలైన వివాదాలు ఇంకా ముగియ లేదు. కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన ఎవరిని విష్ణు ఆహ్వానించనట్లుగా సమాచారం. మంచు మనోజ్‌, పవన్‌ కల్యాణ్‌ను ఓ సినిమా సెట్‌లో కలిశారు. మనోజ్‌ విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా పవన్‌ను కోరినట్లు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై విష్ణు టీం కానీ, పవన్‌ టీం కాని స్పష్టత ఇవ్వలేదు. అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తానన్నా మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్, అతని ప్యానెల్‏లో గెలిచిన సభ్యులకు ప్రమాణ స్వీకారానికి రావాలని ఫోన్‏లో ఆహ్వాన సందేశం పంపారు. అలాగే ప్రతి మా సభ్యుడికి మా కార్యాలయం మెసెజ్‌ ద్వారా ఆహ్వానం పంపింది. 

Related posts

TheIndiaMedia Website For Sale.

Best Must Watch Netflix series!

Top 5 Best Bollywood Movies to watch for non stop entertainment!

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More